బంగారు నగల దొంగ అరెస్టు
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:00 AM
పట్టణంలో బంగారు బంగా రు నగలు దొంగలించే దొంగను అరెస్టు చేశామని, అతని వద్ద నుంచి ఆరు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీనివాసులు, వనటౌన సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు.
ధర్మవరం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): పట్టణంలో బంగారు బంగా రు నగలు దొంగలించే దొంగను అరెస్టు చేశామని, అతని వద్ద నుంచి ఆరు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీనివాసులు, వనటౌన సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. నిందితుడ్ని స్థానిక కేతిరెడ్డికాలనీకి చెందిన సాకే నారాయణగా గుర్తిం చామన్నారు. శుక్రవారం సాయంత్రం వనటౌన పోలీసుస్టేషనలో వారు తెలిపిన వివరాల మేరకు... నారాయణ అంజుమన సర్కిల్‌లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళల మెడలో ఉన్న బంగారు ఆభర ణాలను అపహరించేవాడు. అదేవిధంగా లక్ష్మీచెన్నకేశవపురంలో ఓ ఇంటిలో తాళం పగలకొట్టి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. వీటిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం లక్ష్మీచెన్నకేశవపురం సర్కిల్లో సాకే నారాయణ ఉన్నట్టు సమా చారం రావడంతో వనటౌన సీఐ, సిబ్బంది శివకుమార్, భాస్కర్‌తో కలిసి వెళ్లి అతన్ని అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న రూ.4.25 లక్షల విలువ చేసే ఆరు తులాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.