Share News

తీరంలో కనకం వేట!

ABN , Publish Date - Nov 29 , 2024 | 05:52 AM

బంగారం కోసం గనులు తవ్వుతారని తెలుసు! సముద్రంలో చేపలు వేటాడుతారనీ తెలుసు!! కానీ సముద్రంలో బంగారం వేటాడతారని తెలుసా?!..

తీరంలో కనకం వేట!

ఉప్పాడ తీరంలో మత్స్యకారుల సందడి..

బంగారు రజను కోసం వెతుకులాట

కొత్తపల్లి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): బంగారం కోసం గనులు తవ్వుతారని తెలుసు! సముద్రంలో చేపలు వేటాడుతారనీ తెలుసు!! కానీ సముద్రంలో బంగారం వేటాడతారని తెలుసా?!.. అవును.. ఇది నిజమే..! కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరం ప్రత్యేకత ఇది! తుఫాన్‌, అల్పపీడనాలు ఏర్పడిన సందర్భాల్లో సముద్ర గర్భంలో నుంచి బంగారు రజను కొట్టుకొస్తుందని మత్స్యకారుల నమ్మకం. పూర్వకాలం ఇక్కడో మహానగరం ఉండేదని, అప్పట్లో సముద్రం పొంగి నగరం సముద్ర గర్భంలో కలిసిపోయిందని తమ పెద్దలు చెప్పేవారని మత్స్యకార మహిళ కోదండ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తీరప్రాంతంలో మత్స్యకారులు చిన్నా పెద్దా.. ప్రస్తుతం కనకం వేట ప్రారంభించారు. తుఫాన్లు, అల్పపీడనాలు ఏర్పడిన సందర్భాల్లో సముద్రం ఉప్పొంగి అల్లకల్లోలంగా మారినప్పుడల్లా ఇలా బంగారు రజను కోసం వెదుకులాట ప్రారంభిస్తారు. ఒక్కొక్కరూ ఒక్కొక్క దువ్వెన పట్టుకుని.. కెరటాలు ఒడ్డుకొచ్చి.. తిరిగి లోపలకు వెళ్లే సమయంలో ఇసుకపై దువ్వెనతో గీస్తారు. ఇలా చేయడం ద్వారా అదృష్టం ఉంటే ఇసుక లోపల నుంచి మిణుకు మిణుకుమంటూ చిన్నచిన్న బంగారు రజను మత్స్యకారుల కంట పడుతుంది.

Updated Date - Nov 29 , 2024 | 05:52 AM