వెయిట్ లిఫ్టింగ్‌లో మేటి
ABN , Publish Date - Dec 14 , 2024 | 12:09 AM
వెంకటలక్ష్మి మారుమూల గ్రామంలో పుట్టారు. రెండేళ్లకే తండ్రి చనిపోయారు. జీవితం పొడవునా అవాంతరాలే.
జాతీయ స్థాయికి చేరుకున్న వెంకటలక్ష్మి
అసరా లేని క్రీడాకారిణికి పసిడి పథకం
ఆలూరు, డిసంబరు13 (ఆంధ్రజ్యోతి) : వెంకటలక్ష్మి మారుమూల గ్రామంలో పుట్టారు. రెండేళ్లకే తండ్రి చనిపోయారు. జీవితం పొడవునా అవాంతరాలే. ముందుండి నడిపించేవారు లేరు. అయినా ఆమె ఇక్కడా ఆగిపోలేదు. ఆమె పట్టుదల గొప్పది. పవర్ వెయిట్ లిఫ్టింగ్ 59వ విభాగంలో పసిడి పథకం సాధించారు. మండలంలోని కైరుప్పల గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి విజేతగా గుర్తింపుపొందారు.
వీరభద్రి, నరసమ్మ దంపతుల ముగ్గురు కుమార్తెల్లో వెంకటలక్ష్మి రెండో సంతానం. ప్రాథమిక విద్య గ్రామంలోనే. ఇంటర్, వెయిట్ లిఫ్ట్టింగ్ ఈవెంట్‌లో ఆసక్తి కనపరుస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రాణించారు. 2022లో విశాఖపట్నంలో నేషనల్ పవర్ వెయిట్ లిఫ్టింగ్ 59కేటగిరిలో బంగారు పతకాన్ని సాధించారు. తండ్రి లేకపోయినా ఆత్మస్థైర్యంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని పవర్ వెయిట్ లిఫ్టింగ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. జిల్లా స్థాయి అధికారుల చేత అవార్డులు అందుకున్నారు. కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకొని అక్క చెల్లెళ్లకు వివాహాలు చేశారు. కుటుంబ ఆర్థిక స్థితి బాగా లేకపోవడంతో డిల్లీ నుంచి పిలుపు వచ్చినా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనలేకపోయారు. ప్రస్తుతం బెంగుళూరులో పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ బీపీడీ కోర్సు చదువుతున్నారు. గత ఏడాది యువగళం పాదయాత్ర కైరుప్పల గ్రామం మీదుగా వెళ్లిన ప్రస్తుత ఐటీ, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేత అభినందనలు కూడా అందుకున్నారు.
ఫ ప్రోత్సహిస్తే మరిన్ని పతకాలు సాధిస్తాం- వెంకటలక్ష్మి జాతీయ క్రీడాకారిణి
క్రీడలు, స్పోర్ట్స్‌పై ఉన్న ఆసక్తి నన్ను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని పతకాలు సాధిస్తాను..