Share News

ప్రతి ధాన్యం గింజకు గిట్టుబాటు ధర

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:22 AM

రైతులు పం డించిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

ప్రతి ధాన్యం గింజకు గిట్టుబాటు ధర

ఏలూరు సిటీ, అక్టోబరు 22: రైతులు పం డించిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌ లో అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి పార్ధసారఽధితో కలిసి పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఽజిల్లాలో అవసరమైతే ఏప్రిల్‌ మొదటి వారం వరకు ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలుపు తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక క్లష్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా ఇంచార్జ్‌ మంత్రిగా ఏలూరు కలెక్టరేట్‌కు విచ్చేసిన మనోహర్‌కు స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందించారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, ఎస్పీ శివకిషోర్‌, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య(చంటి), పత్సమట్ల ధర్మ రాజు, సొంగా రోషన్‌కుమార్‌, చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకట్రాజు, జేసీ పి. ధాత్రిరెడ్డి తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

కౌలు రైతు చట్టంలో మార్పు చేస్తాం..

స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమి సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాలో అమలు జరుగుతున్న పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఎమ్మెల్యేలు, అధికారుల తో సమీక్షించారు. రానున్న ఖరీఫ్‌ నుంచి భూయజమాని హక్కులకు భంగం కలుగకుండా కౌలు రైతుల సంక్షేమానికి కొత్త చట్టాన్ని తీసుకు వస్తున్నామన్నారు. జిల్లాలో ఆయిల్‌పామ్‌, కోకో పంటలకు అనువైన వాతావరణం పరిస్థితులు ఉన్నాయని, వీటి సాగుకు రైతులకు మరింత ప్రోత్సాహం అందించాలన్నారు. సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందేలా చూడాలన్నారు. మం త్రి కొలుసు పార్ధసారధి మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఎంతో అనుభవం కలిగిన నేత అని, ఇంచార్జి మంత్రిగా నియమి ంచటం సంతోషించదగ్గ విషయమన్నారు. జిల్లాలో అటవీ భూములను సమగ్రసర్వే నిర్వహించి సరి హద్దులను నిర్ణయిస్తే రైతులు, అటవీ శాఖాధి కారులకు ఎటువంటి సమస్యలు ఉండవన్నారు. ఇటీవల వరదలు, భారీ వర్షాలు కారణంగా దెబ్బతిన్న చెరువులకు మరమ్మతులు చేయిం చాలని, తమ్మిలేరు, బుడమేరు, రామి లేరులలో పూడికతీత, చెత్తను తొలగించాలన్నారు.

కలెక్టర్‌ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ ఇప్పటి వరకు 58 గ్రామ సభలు పూర్తి అయ్యాయన్నారు. రూ. 103 కోట్లతో సిసిరోడ్లు నిర్మాణానికి పరిపాలనా పరమైన ఆమోదం అందించామని, వీటిని జనవరి 15వతేదీ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 801 పశువుల షెడ్లు నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. ఎస్పీ కె ప్రతాప్‌ శివకిషోర్‌ మాట్లాడుతూ జిల్లాలో కొన్ని పోలీస్‌ స్టేషన్‌లు శిఽధిలావస్థలో ఉన్నాయని, వాటి మరమ్మత్తులు చేయాల్సి ఉందన్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ, జనసేన వాగ్వాదం.. తోపులాట

ఉంగుటూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మంగళవారం ఘర్షణ వాతావరణం నెలకొంది. కొద్దిసేపట్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించే ముందు మినుము విత్తనాలను మంత్రి నాదెండ్ల మనోహర్‌ చేతుల మీదుగా అందించడానికి రైతులను వ్యవసాయ శాఖ గుర్తించిందని, వారందరూ టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరి గింది. పరిస్థితి ఉద్రిక్తం కాకుండా ఉండేందుకు ఇరు వర్గాలను పోలీసులు సముదాయించారు. దీనిపై భీమడోలు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పి.ఉషా రాజకుమారి మాట్లాడుతూ తాము అసలు రైతుల పేర్లు నమోదు చేయలేదని స్పష్టం చేశారు.

Updated Date - Oct 23 , 2024 | 01:22 AM