Share News

అంగన్వాడీ టాయిలెట్‌లో సరుకులు..!

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:13 AM

బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అందజేయాల్సిన పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కార్యకర్తలు టాయిలెట్‌ గదిలో దాచారు.

అంగన్వాడీ టాయిలెట్‌లో సరుకులు..!

కళ్యాణదుర్గం, ఫిబ్రవరి 1: బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అందజేయాల్సిన పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కార్యకర్తలు టాయిలెట్‌ గదిలో దాచారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ములకనూరు గ్రామంలో ఈ వ్యవహారం గురువారం వెలుగు చూసింది. అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలో ఉన్న సమయంలో సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రం నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. వారు సమ్మె విరమించిన అనంతరం తిరిగి అప్పగించారు. గ్రామంలోని రెండో అంగన్వాడీ కేంద్రం పరిధిలో పౌష్టికాహారం పంపిణీ జరగకపోవడంతో అప్పట్లో పనిచేసిన యూనిమేటర్‌, మహిళా పోలీస్‌, వీఆర్‌ఏలను లబ్ధిదారులు పలుమార్లు ప్రశ్నించారు. అనుమానం వచ్చి టాయిలెట్‌ గది తాళాలను పగులగొట్టారు. అందులో పది బియ్యం ప్యాకెట్లు, 20 ఆయిల్‌ ప్యాకెట్లు, 20 గోధుమ పిండి ప్యాకెట్లు, 10 కందిపప్పు ప్యాకెట్లు దొరికాయి. ఈ వ్యవహారంపై సీడీపీవో వనజా అక్కమ్మ విచారణ చేపట్టారు.

Updated Date - Feb 02 , 2024 | 08:16 AM