Share News

ChandraBabu Govt: ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిపై వేటు!

ABN , Publish Date - Aug 01 , 2024 | 08:41 AM

గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ మినరల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అందులోభాగంగా వెంకట్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడంతోపాటు కేసు నమోదు చేసేందుకు రంగం సిద్దమైందని తెలుస్తుంది.

ChandraBabu Govt: ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిపై వేటు!

అమరావతి, ఆగస్ట్ 01: గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ మినరల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అందులోభాగంగా వెంకట్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడంతోపాటు కేసు నమోదు చేసేందుకు రంగం సిద్దమైంది. గత ప్రభుత్వంలో ఇసుక, బీచ్ శాండ్, బొగ్గు, గనుల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గనుల శాఖ ఉన్నతాధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఆ ఆరోపణలు రుజువయ్యాయి. దీంతో వెంకట్ రెడ్డిని సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేయాలని సీఎం చంద్రబాబుకు గనుల శాఖ ఉన్నతాధికారులు సిఫార్స్ చేశారు. అందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఆదేశాలు వెలువడే అవకాశాలున్నాయి.


పెద్దిరెడ్డి ఆదేశాలు పాటించిన వెంకటరెడ్డి..

అయితే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలను ఎండీ వెంకట్‌రెడ్డి తూ. చా తప్పకుండా పాటించే వారనే ఓ ప్రచారం సైతం నాడు బలంగా సాగింది. అంతేకాదు ఏపీఎండీసీ ఎండీగా వెంకటరెడ్డి తీసుకున్న పలు కీలక నిర్ణయాలు సైతం నాడు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అయితే కోస్ట్ గార్డు నుంచి డిప్యూటేషన్‌పై ఏపీకి వెంకటరెడ్డి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

Wayanad Landslide: నేడు వయనాడ్‌లో పర్యటించనున్న రాహుల్, ప్రియాంక


వెంకటరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన నాటి ప్రభుత్వం

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో ఏపీలో జగన్ ప్రభుత్వం కొలువు తిరింది. అనంతరం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్న తమకు అనుకూలంగా వ్యవహరించే ఉన్నతాధికారులను ఏపీకి తీసుకు వచ్చేలా గత ప్రభుత్వం పావులు కదిపింది. అలా కోస్ట్ గార్డ్స్‌‌లో పని చేసే వెంకటరెడ్డిని డిప్యూటేషన్‌పై జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకు వచ్చిందని ఓ ప్రచారం సైతం గతంలో సాగింది. ఆ క్రమంలో ఆయనకు అత్యంత ప్రాధాన్యమున్న ఏపీఎండీసీ ఎండీగా బాధ్యతలు కట్టబెట్టింది.

అయితే జగన్ ప్రభుత్వ హయాంలో అనేక శాఖలపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ గనుల శాఖపై మాత్రం అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. గత ప్రభుత్వ హయాంలో సామాన్య మానవుడు ఇల్లు నిర్మించుకోవాలంటే ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడిందన్న విషయం అందరికి తెలిసిందే. ఇక 2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. అనంతరం అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వివిధ శాఖలపై ప్రభుత్వం శాఖపరమైన విచారణ జరుపుతుంది. అందులోభాగంగా గనుల శాఖపై విచారణ జరిగింది.


ఏపీఎండీసీ కార్యాలయం సీజ్ చేసిన కూటమి ప్రభుత్వం

మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే.. ఏపీఎండీసీ కార్యాలయాన్ని సీజ్ చేసిన విషయం విధితమే. అలాగే ప్రభుత్వ రికార్డులు బయటకు వెళ్లకుండా తగు చర్యలు సైతం ఈ ప్రభుత్వం తీసుకుంది. దీంతో గత ప్రభుత్వంలో తీసుకున్న కీలక నిర్ణయాల తాలుక అన్ని అంశాలను గనుల శాఖ ఉన్నతాధికారులు పరిశీలించి నివేదికను రూపొందించారు. ఆ నివేదికకు సీఎం చంద్రబాబుకు నివేదించారు. దీంతో వెంకటరెడ్డిపై చర్యలకు ప్రభుత్వం తీసుకోనుంది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 01 , 2024 | 08:41 AM