Share News

సంక్షోభంలో చేనేత రంగం

ABN , Publish Date - Oct 02 , 2024 | 11:29 PM

ప్రస్తుతం చేనేత రంగం సంక్షోభంలో ఉందని, ప్రభుత్వాలు ఆదుకోవాలని చేనేత కార్మికులు వేడుకొంటున్నారు.

సంక్షోభంలో చేనేత రంగం
ప్రస్తుతం చేనేత రంగం సంక్షోభంలో ఉందని, ప్రభుత్వాలు ఆదుకోవాలని చేనేత కార్మికులు వేడుకొంటున్నారు.

వార్సులను సరిచేస్తున్న మహిళ

ముడిసరుకు ధరలెక్కువ.. తయారైన

పట్టు చీరలకు డిమాండ్‌ తక్కువ

పూట గడవక.. బిడ్డలకు చదువు

ఇప్పించలేక ఆర్థిక ఇబ్బందుల్లో

నేత కార్మికులు

ఆదుకోవాలని ప్రభుత్వాలకు వినతి

మదనపల్లె అర్బన, అక్టోబరు 2: మదనపల్లె పట్టణం, నీరుగట్టువారిపల్లెకు సిల్క్‌టౌనగా ఏపీ రాష్ట్రంలోనే పేరొందింది. ఇక్కడ చేనేత రంగంతోపాటు అనుబంధ రంగాల్లో 20 వేల మందికిపైగా కార్మికులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం చేనేత రంగం సంక్షోభంలో ఉందని, ప్రభుత్వాలు ఆదుకోవాలని చేనేత కార్మికులు వేడుకొంటున్నారు. బిడ్డల చదువులు పక్కన పెడితే పూట గడవడమే కష్టతరంగా మారింది. ముడిసరుకుల ధరలెక్కువ దానితో తయారైన పట్టు చీరలు రేట్టు తగ్గిపోవడంతో పట్టు చీరల వ్యాపారాలు స్తబ్దుగా నిలిచిపోయాయి. పట్టు చీరలు డిమాండ్‌ లేకపోవడంతో ఎగుమతులు ఆపేశారు. అరకొర వ్యాపారాలు, అందులోను ముడి సరుకు కొనుగోలు చేయలేని పరిస్థితిలో చేనేత మగ్గాల యాజమాన్యం ఉండడంతో చేనేత కార్మికులు పని దొరకక ప్రత్యామ్నాయ పనులు మేసి్త్ర పనులు, టమోటా మార్కెట్‌లో కూలీలుగా మారిపోతున్నా రు. చేనేత మగ్గాల యాజమాన్యం నష్టాలు రావడంతో అవి మానేసి వేరువేరు వ్యాపారాల్లో నిమగ్నమౌతున్నారు. తమ పిల్లలకు నాణ్యమైన చదువు లు ఇప్పించలేని పరిస్థితి నెలకొంది. ఇందులో ము డి సరుకు సిల్క్‌ కిలో రూ.4500 పలుకుతుంది. దానికి తోడు రంగులు అద్దకం, వార్పులు వేయడం తదితర కూలీలు పెరిగిపోవడంతో చేనేత రంగం కుదేలు అవుతోంది. ఒక పట్టు చీర తయారు చేసి న తరువాత అన్ని లెక్కలు చూస్తే చీరపై రూ. 500 కూడా గిట్టుబాటు రావడంలేదని యాజమా న్యం వాపోతున్నారు. ఉన్న చేనేత కూలీలతో పట్టు చీరలు నేసినా అమ్మకాలు లేక ఇంట్లోనే ఉంచుకోవాల్సి వస్తోంది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో సిల్క్‌ సబ్సిడీపై చేనేత కార్మికులకు గుర్తింపు పుస్తకాల ద్వారా అందించేవారు. వ్యక్తి రుణాలు చేనేత కార్మికులకు సబ్సిడీపై లక్ష నుంచి 5 లక్షల వరకు అం దించేవారు. తయారైన పట్టుచీరలు ఎగుమతులు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుత పరిస్థితిల్లో చేనేత కా ర్మికులకు ఇస్తున్న అన్ని రాయితీలు తొలగించడం తో కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. ఆఫ్కోవారు పట్టు చీరలను కొనుగోలు చేసేవారు. చేనేత కార్మికులకు సొసైటీల ద్వారా అన్ని సౌకర్యాలు, సబ్సిడీలు అందించేవారు. అందులోను మరమగ్గా లు అందుబాటులోకి వచ్చినందున నేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వాలు ఆర్థికసాయం చేయాలని, బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముడిసరుకులకు రాయితీ కల్పించాలని చేనేత కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. అన్ని విధాల చేనేత కార్మికులను ఆదుకుని చేనేత రంగాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాని ప్రభుత్వాలను కోరుతున్నారు. రాజకీయాల కోసం చేనేత కార్మికులను వాడుకొంటున్నారే తప్ప ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు. రాజకీయ నాయకులు చేనేత కార్మికులకు ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు.

నేతన్న నేస్తం లాంటి పథకాలను ప్రభుత్వం అమలు చేయాలి..

చేనేత కార్మికుల అభివృద్దిని ఆకాంక్షించి ప్రభుత్వం నేతన్న నేస్తం లాంటి పథకాలను అమలు చేయాలని, బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించాలన్నారు. అప్పుడే చేనేత రంగం సంక్షోభం నుంచి వైతొలుగుతుంది.

- ఎం. రామ్మోహన, చేనేత కార్మిక సంఘం యూనియన ఉపాధ్యక్షుడు, నీరుట్టువారిపల్లె

చేనేత కార్మికులను

ఆర్థిఽకంగా బలోపేతం చేయాలి..

చేనేత కార్మికుల ఆర్ధికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ముడిసరకులు సబ్సిడీ ధరలకే విక్రయించాలి. చేనేత కార్మికుల సొసైటీలు ఏర్పాటు చేయాలి. చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడకుండా చర్య లు చేపట్టాలి.

- మోడెం నాగరాజ, చేనేత సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడు, గజ్జలకుంట, మదనపల్లె

Updated Date - Oct 02 , 2024 | 11:29 PM