Share News

చిరుధాన్య వంటలతో ఆరోగ్యం

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:36 AM

చిరుధాన్యాల వంటలతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని వాసన సంస్థ ప్రతినిధి ఉత్తప్ప పేర్కొన్నారు. శనివారం మండలంలోని గందోడివారిపల్లిలో చిరుధాన్యలతో వంటల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

చిరుధాన్య వంటలతో ఆరోగ్యం
చిరుధాన్యాల వంటల పోటీల్లో పాల్గొన్న మహిళలు

తనకల్లు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): చిరుధాన్యాల వంటలతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని వాసన సంస్థ ప్రతినిధి ఉత్తప్ప పేర్కొన్నారు. శనివారం మండలంలోని గందోడివారిపల్లిలో చిరుధాన్యలతో వంటల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళలు చిరుధాన్యాలతో తయారు చేసిన వివిధరకాల వంటకానుల తీసుకువచ్చారు. వంటలను సమావేశానికి వచ్చిన అందరికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలలపాటు చిరుధాన్యాల వంటకాల పోటీలను గ్రామంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసన సంస్థకు చెందిన రామమోహన, జనజాగృతి ప్రతినిధులు గరుడప్ప, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ లక్ష్మీదేవమ్మ పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:36 AM