Share News

వాసుదేవరెడ్డికి షరతులతో ముందస్తు బెయిల్‌

ABN , Publish Date - Nov 30 , 2024 | 04:18 AM

విజయవాడ మద్యం షాపు లీజు అగ్రిమెంట్‌ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో బేవరేజెస్‌ కార్పోరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఆయన బంధువు వరప్రసాద్‌రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన ముంద స్తు బెయిల్‌ మంజూరు చేసింది.

వాసుదేవరెడ్డికి షరతులతో ముందస్తు బెయిల్‌

అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): విజయవాడ మద్యం షాపు లీజు అగ్రిమెంట్‌ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో బేవరేజెస్‌ కార్పోరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఆయన బంధువు వరప్రసాద్‌రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన ముంద స్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. విజయవాడ, గాంధీనగర్‌లోని అలంకార్‌ కాంప్లెక్స్‌లో మద్యం షాపు ఏర్పాటుకు లీజు అగ్రిమెంట్‌ కోసం అడిగినంత ఇవ్వలేదనే కారణంతో తన సంతకం ఫోర్జరీ చేసి అర్ధంతరంగా లీజు అగ్రిమెంట్‌ను రద్దు చేశారని విజయవాడకు చెందిన వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వాసుదేవరెడ్డి, వరప్రసాద్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల వాదనలు ముగియగా.. శుక్రవారం తీర్పు వెల్లడించారు.

Updated Date - Nov 30 , 2024 | 04:18 AM