AP Elections: తంబళ్లపల్లి నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
ABN , Publish Date - Apr 19 , 2024 | 08:50 PM
ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో నామినేషన్ కేంద్రం వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. గురువారం వైసీపీ అభ్యర్థి ద్వారాకనాథ రెడ్డి నామినేషన్ వేశారు. అయితే ఆ సమయంలో పరిమితికి మించి ఆ పార్టీ శ్రేణులు తరలి వచ్చాయి.
చిత్తూరు, ఏప్రిల్ 19: ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో నామినేషన్ కేంద్రం వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. గురువారం వైసీపీ అభ్యర్థి ద్వారాకనాథ రెడ్డి నామినేషన్ వేశారు. అయితే ఆ సమయంలో పరిమితికి మించి ఆ పార్టీ శ్రేణులు తరలి వచ్చాయి. కానీ నిబంధనలు ప్రకారం అంత మంది ఉండకూడదంటూ.. పోలీసులు వారిపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు.
AP Election 2024: ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు.. కారణమిదే..?
కానీ శుక్రవారం టీడీపీ అభ్యర్థి దాసరి జయచంద్రారెడ్డి నామినేషన్ వేసేందుకు ఆర్వో కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ క్రమంలో ప్రభుత్వ కార్యాలయ ఆవరణంలోనికి భారీగా టీడీపీ శ్రేణులు చొచ్చుకు వచ్చాయి. వారిని నిలువరించే ప్రయత్నంలో పోలీసులు లాఠీచార్జి చేశారు.
AP Elections: సీఎం జగన్ రాయలసీమ ద్రోహి: చంద్రబాబు
అయితే ఈ లాఠీచార్జి జరుగుతున్న సమయంలో ఆగంతకులు ఆ ప్రాంతలో రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ట్రైనీ డిఎస్పీకి స్వల్ప గాయాలయ్యాయి. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. దాంతో కూటమి అభ్యర్థి టిడిపి నాయకుడు దాసరి జయచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం...