వెయ్యిమంది పేదలకు ఇళ్ల స్థలాలు
ABN , Publish Date - Nov 29 , 2024 | 11:44 PM
మదనపల్లె పట్టణంలోని వెయ్యి మంది నిరుపే దలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు కృషిచే స్తున్నామని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నా రు.
సీఎం చేతుల మీదుగా పంపిణీ చేయిస్తాం ఎమ్మెల్యే షాజహానబాషా
మదనపల్లె/టౌన, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మదనపల్లె పట్టణంలోని వెయ్యి మంది నిరుపే దలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు కృషిచే స్తున్నామని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నా రు. శుక్రవారం మండలంలోకి కోళ్లబైలు గ్రామం సర్వనెంబర్ 602, 603, 604లో పదెకరాల ప్రభు త్వ భూమి ఆయన పరిశీలించారు. దీంతో పాటు ఇదే ప్రాంతంలో మరో 15 ఎకరాలు భూమి సేకరి స్తామన్నారు. ప్రస్థుతానికి ఐదెకరాల్లో లేఅవుట్ వేసి 150 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక వెయ్యి మందికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల స్థలాలు మంజూరు చేయిస్తామన్నారు. కోళ్లబైలు పంచాయతీలో రూ.1.50కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. తక్కువ సమయంలోనే ప్రభుత్వ స్థలాన్ని గుర్తించిన రెవెన్యూ, హౌసింగ్ అధికారులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తాజ్‌మస్రూర్, హౌసింగ్ డీఈ రమేశరెడ్డి, దీనదయాళ్, ఆర్‌ఐ శేషాద్రిరావు, వీఆర్‌వో నారాయణ, టీడీపీ నాయకులు రాటకొండ శ్రీనివాసులు, నవీన, కె.కృష్ణ పాల్గొన్నారు. మదనపల్లె పట్టణం అవెన్యూరోడ్డులోని శ్రీకృష్ణ మున్సిపల్ స్కూల్ ప్రాథమికోన్నత పాఠశాల వద్ద డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే ఎం.షాజహానబాషా భూమి పూజ చేశారు. రూ.14లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టే ఈ పనులను మున్సిపల్ చైర్‌పర్సన వి.మనూజతో కలసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అలాగే మాస్టర్‌మైండ్ స్కూల్‌లో రూ.10లక్షల వ్యయంతో రెండు చోట్ల సిమెంటు రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అంతకుముందు కమిషనర్ కె.ప్రమీల ఆధ్వర్యంలో మెప్మా కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. సమావేశంలో కౌన్సిలర్ వాయిస్ కరీముల్లా, ఎస్.ఎ.మస్తాన, సీఎంఎం మధుసూదనరెడ్డి, మహిళ సంఘాల లీడర్లు, ఆర్‌పీలు పాల్గొన్నారు.