ఫారెక్స్ నిల్వల్లో భారీ వృద్ధి
ABN , Publish Date - Mar 09 , 2024 | 02:55 AM
భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వల్లో భారీ వృద్ధి నమోదైంది. ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ నెల 1తో ముగిసిన వారం లో ఫారెక్స్ నిల్వలు మరో 655 కోట్ల డాలర్ల మేర పెరిగి మొత్తం 62,562.6 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.
ముంబై: భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వల్లో భారీ వృద్ధి నమోదైంది. ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ నెల 1తో ముగిసిన వారం లో ఫారెక్స్ నిల్వలు మరో 655 కోట్ల డాలర్ల మేర పెరిగి మొత్తం 62,562.6 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. అంతక్రితం వారంలోనూ నిల్వలు 297 డాలర్లకు పైగా పెరిగాయి. 2021 అక్టోబరులో ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైం రికార్డు గరిష్ఠ స్థాయి 64,500 కోట్ల డాలర్లకు పెరిగాయి. కానీ, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో రూపాయి విలువ క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్‌బీఐ మార్కెట్లోకి విరివిగా డాలర్లను విడుదల చేయాల్సి రావడంతో ఫారెక్స్ నిల్వలు మళ్లీ తగ్గుతూ వచ్చాయి.
మొబైల్ టెలికాం సేవలకు ఉపయోగపడే ఎనిమిది బ్యాండ్ల స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం మే 20వ తేదీ నుంచి వేలం వేయనుంది. టెలికాం శాఖ (డాట్) శుక్రవారం దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎనిమిది బ్యాండ్ల స్పెక్ట్రమ్ కనీస ధరను రూ.96,317.65 కోట్లుగా నిర్ణయించారు.
ఇండియా యమహా మోటార్ (ఐవైఎం).. తిరుపతిలో బ్లూ స్క్వేర్ ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఔట్‌లెట్‌తో దేశవ్యాప్తంగా కంపెనీ బ్లూ స్క్వేర్ షోరూమ్స్ సంఖ్య 300కు చేరింది. ఈ షోరూమ్‌లో కంపెనీ తన ప్రీమియం మోటార్ సైకిళ్లను విక్రయించటంతో పాటు యాక్సెసరీస్, విక్రయానంతర సేవలను అందించనుంది.
రిలయన్స్ రిటైల్‌కు చెందిన ట్రెండ్స్.. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది.