ఐఏఎస్, ఐపీఎ్‌సలే వ్యవస్థలను భ్రష్టుపట్టించారు
ABN , Publish Date - Jun 20 , 2024 | 03:14 AM
వైసీపీ ఐదేళ్ల పాలనలో కొందరు ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు వ్యవస్థలను భ్రష్టుపట్టించారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వంలో మా కుటుంబానికి తీరని అన్యాయం: జేసీ ప్రభాకర్‌రెడ్డి
అనంతపురం జూన్ 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో కొందరు ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు వ్యవస్థలను భ్రష్టుపట్టించారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. కొందరు అధికారులతోపాటు ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పేర్నినానిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘వైౖసీపీ ప్రభుత్వంలో నా కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది. మమ్మల్ని దొంగోళ్లను చేశారు. నాతోపాటు నా భార్య, కొడుకు, కోడళ్లపై కేసులు పెట్టారు. నన్ను, నా కొడుకును జైలుకు పంపించారు’ అని ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. మహిళా అధికారులను తాను బెదిరిస్తున్నానని జగన్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని జేసీ ప్రభాకర్ మండిపడ్డారు. మరోసారి ఇలాంటి అతస్య వార్తలను ప్రసారం చేస్తే ఖచ్చితంగా జగన్ పత్రిక కార్యాలయాన్ని మూసివేయిస్తానని ఆయన హెచ్చరించారు.