Share News

‘హైబ్రిడ్‌’ ఉద్యోగాలకు ప్రాధాన్యం

ABN , Publish Date - Sep 27 , 2024 | 05:34 AM

ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే

‘హైబ్రిడ్‌’ ఉద్యోగాలకు ప్రాధాన్యం

బహుళజాతి కంపెనీలతో శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు

ప్రైవేటులో అవకాశాలపై సీఎం సమీక్ష

ఎన్నికల హామీ అమలుకు కసరత్తు

నైపుణ్యాలు పెంపొందిస్తే ప్రైవేటులో భారీగా ఉపాధి అవకాశాలు: సీఎం

అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో నైపుణ్య శిక్షణ, సెర్ప్‌ ఎంఎ్‌సఎంఈ, పరిశ్రమల శాఖల అధికారులు, పారిశ్రామిక రంగ నిపుణులతో సమావేశమయ్యారు. హైబ్రిడ్‌ విధానంలో ఇంటి వద్ద నుంచే పనిచేసే ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించడం ద్వారా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. బహుళజాతి కంపెనీలతో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వివిధ కారణాలతో గ్రామాల్లో ఉండిపోయినవారికి తగిన అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలొస్తాయని.. ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి ఈ దిశగా పనిచేయాలని కోరారు. విజయవాడ వరదలో సర్వం కోల్పోయిన బాధితులు తమకు ఉపాధి కల్పించాలని కోరారని, వారికి ఎలాంటి ఉపాధి కల్పించవచ్చో పరిశీలనచేసి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

Updated Date - Sep 27 , 2024 | 05:34 AM