Share News

షష్ఠి వేడుకల్లో అసౌకర్యం రాకూడదు

ABN , Publish Date - Dec 05 , 2024 | 01:59 AM

బిక్కవోలు శ్రీకుమారసుబ్రహ్మణ్యస్వామి షష్ఠిలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దేవదాయ, రెవిన్యూ, పోలీస్‌, ఉత్సవ కమిటీ చూడాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు.

షష్ఠి వేడుకల్లో అసౌకర్యం రాకూడదు

బిక్కవోలు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): బిక్కవోలు శ్రీకుమారసుబ్రహ్మణ్యస్వామి షష్ఠిలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దేవదాయ, రెవిన్యూ, పోలీస్‌, ఉత్సవ కమిటీ చూడాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన గ్రామంలోని శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 6 నుంచి 12 వరకూ షష్ఠి ఉత్సవాలు నిర్వహిస్తారని, 7న స్వామి వారి షష్ఠి జరుపుతారన్నారు. దూరప్రాంతాల నుంచి లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనానికి వస్తారని వీరికి ఏలోటు రాకుండా చూసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. అనంతరం ఆయన షష్ఠి ఉత్సవాలకు ఎన్నో యేళ్లుగా ఆనవాయితీ నిర్వహిస్తున్న వీరభద్రుని సంబరంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వీరభద్రుని సంబర కర్తలు జగ్గవరపు సురేష్‌కుమార్‌రెడ్డి సౌజన్య దంపతులు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పల్లి శ్రీనివాసరెడ్డి, కూటమి నేతలు చాగంటి సాయిబాబారెడ్డి, పాలచర్ల శివప్రసాద్‌చౌదరి, గొర్రెల త్రిమూర్తులు, సింగారపు రామారావు, నందిపాటి కిషోర్‌కుమార్‌రెడ్డి, పల్లి రాజారె డ్డి, కొమ్మోజు శ్రీనివాస్‌, రాయుడు రామచంద్రరావు, నవుడు ధర్మరాజు, చిరంజీవి రాజు, ఆలయ ఈఓ ఆకెళ్ల భాస్కర్‌, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2024 | 02:00 AM