ఈవీఎం వేర్‌హౌస్ పరిశీలన
ABN , Publish Date - Dec 21 , 2024 | 11:45 PM
త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎంలు భద్రపరిచిన వేర్‌హౌ్‌సను జిల్లా కలెక్టర్ పి.రంజిత బాషా పరిశీలించారు.
కర్నూలు కలెక్టరేట్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎంలు భద్రపరిచిన వేర్‌హౌ్‌సను జిల్లా కలెక్టర్ పి.రంజిత బాషా పరిశీలించారు. శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం వేర్‌హౌ్‌సలో ఈవీఎంలను భద్రపరిచిన తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎం వేర్‌హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. గోడౌన్సలోని ఇంటర్నల్ పార్టిషన్లకు ప్రస్తుతం ఉన్న తాళాల కంటే పెద్ద తాళాలు వేయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సంబంధిత రిజిస్టర్‌లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. లెక్టర్ వెంట డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ మురళి, టీడీపీ జనరల్ సెక్రటరీ ఎల్‌వీ ప్రసాద్, బీజేపీ స్టేట్ ఎలక్షన సెల్ ప్రతినిధి సాయిప్రదీప్, వైసీపీ పార్టీ ప్రతినిధి కే.పుల్లారెడద్డి,, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి షేక్ ఇజాజ్ అహ్మద్, బీఎ్‌ససీ ప్రతినిధి అరుణ్ కుమార్ పాల్గొన్నారు.