Share News

ఇన్యూరెన్సు క్లెయిమ్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:56 AM

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన, దెబ్బతిన్న వా హనాలు, ఇళ్లు, దుకాణాలతో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపార సముదాయాలు వంటి ఆస్తుల కు సంబంధించి క్లయిమ్స్‌ను త్వరగా పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ జి.సృజన తెలిపారు.

ఇన్యూరెన్సు క్లెయిమ్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్‌

విజయవాడ లీగల్‌, సెప్టెంబరు 11: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన, దెబ్బతిన్న వా హనాలు, ఇళ్లు, దుకాణాలతో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపార సముదాయాలు వంటి ఆస్తుల కు సంబంధించి క్లయిమ్స్‌ను త్వరగా పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ జి.సృజన తెలిపారు. ఈనెల 9న సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ సృజన బుధవారం సందర్శించారు. క్లయిమ్‌ల స్వీకరణ, సెటిల్‌మెంట్‌కు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంత రం మాట్లాడుతూ ఎవరూ బీమా కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లే కుండా ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 5వేల క్లయిమ్‌లు రాగా 4వేల క్లయిమ్‌లను అక్కడికక్కడే సెటిల్‌మెంట్‌ చేశారన్నారు. డాక్యుమెంటేషన్‌ విషయాల్లో ఇబ్బందులు లేకుండా సేవలందించడం జరుగుతోందని కలెక్టర్‌ వివరించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో బీహెచ్‌.భవానీశంకర్‌ ఉన్నారు.

లోతట్టు ప్రాంతాల్లో నీటిని బయటికి పంపాలి..

కృష్ణలంక: లోతట్టు ప్రాంతాల్లో ఇంకా ఎక్కడైనా నీరుంటే త్వరగా బయటకు పంపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన అధికారులను ఆదేశించారు. బుధవారం పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవల్‌పమెంట్‌ కమిషనర్‌ కె.కన్నబాబు, కలెక్టర్‌ డాక్టర్‌ సృజనతో కలిసి అంబాపురంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పల్లపు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపేలా కల్వర్టుల్లో డీ సిల్టింగ్‌ చేసి నీరు వేగవంతంగా పారేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సందర్శనలో డీపీవో ఎన్‌వీ శివప్రసాద్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 08:16 AM