Share News

స్టేట్‌ నుంచి కొల్లి ‘ఔట్‌’

ABN , Publish Date - Apr 09 , 2024 | 04:35 AM

సీఎం జగన్‌కి ఎన్నికల కమిషన్‌ మరో గట్టి ‘షాక్‌’ ఇచ్చిం ది. వైసీపీకి కళ్లూ చెవులుగా వ్యవహరిస్తూ, అపరిమిత అధికారాలతో విపక్షాలను లక్ష్యంగా చేసుకున్న ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామిరెడ్డిని స్టేట్‌ నుంచి బయటికి

స్టేట్‌ నుంచి కొల్లి ‘ఔట్‌’

పోలీసు పరిశీలకుడిగా అసోంలో బాధ్యతలు

జగన్‌కు ఎన్నికల కమిషన్‌ మరో షాక్‌

వైసీపీకి ‘అస్మదీయ’ ఐపీఎ్‌సగా రఘురామిరెడ్డి

సిట్‌ పేరుతో విపక్ష నేతలపై గురి

బాబును అరెస్టు చేసింది ఆయనే

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌

సారథిగా అపరిమిత అధికారాలు

ఔషధ నియంత్రణ విభాగంపైనా ఆధిపత్యం

మాట వినని అధికారులు, విపక్షాలపైనే గురి

ఎన్నికల వేళ మరిన్ని వేధింపులకు పథకం!?

ఆయనను తప్పించి గట్టి దెబ్బకొట్టిన ఈసీ

ఇది తెలిసే ‘సిట్‌’లో పత్రాలు కాల్చేశారా?

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

సీఎం జగన్‌కి ఎన్నికల కమిషన్‌ మరో గట్టి ‘షాక్‌’ ఇచ్చిం ది. వైసీపీకి కళ్లూ చెవులుగా వ్యవహరిస్తూ, అపరిమిత అధికారాలతో విపక్షాలను లక్ష్యంగా చేసుకున్న ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామిరెడ్డిని స్టేట్‌ నుంచి బయటికి పంపింది. ఆ యనను అసోంలో ఎన్నికల పోలీసు అబ్జర్వర్‌గా నియమించింది. ఇప్పటికే ఆరుగురు ‘అస్మదీయ’ ఐపీఎ్‌సలు, ముగ్గురు ఐఏఎ్‌సలను ఈసీ పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కొల్లిని రాష్ట్రం నుంచి దూరంగా... ఈశాన్య రాష్ట్రానికి పంపించేయడం గమనార్హం. సోమవారం సాయంత్రం ఈ ఆదేశా లు వెలువడ్డాయి. అదేరోజు ఉదయం కొల్లి రఘురామిరెడ్డి అధిపతిగా ఉన్న ‘సిట్‌’ కార్యాలయంలో కీలక పత్రాలను తగలబెట్టడం గమనార్హం. తనను రాష్ట్రం నుంచి బయటికి పం పించనున్నారని ముందే తెలిసిందా? తాను ఇక్కడ లేని స మయంలో ఏం జరుగుతుందోననే ఆందోళనతో ‘ముందు జాగ్రత్త’గా ఆయా పత్రాలను దహనం చేయించారా?

అన్నీ ఆయనే...

గత ఎన్నికల దాకా ఎన్నికల్లో సాధారణ పరిశీలకులు, వ్య య పరిశీలకులు మాత్రమే ఉండేవారు. ఈ ఎన్నికల్లో ‘పోలీ సు అబ్జర్వర్‌’ను కూడా నియమిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన పలువురు అధికారులను ఇతర రాష్ట్రాలకు పరిశీలకులుగా పంపించారు. కొల్లి రఘురామిరెడ్డిని అసోంలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలీసు పరిశీలకుడిగా నియమించారు. ఆయన.. గువాహటి కేంద్రంగా ఉండి విధులు నిర్వహిస్తారు. జగన్‌ అధికారంలోకి రాగానే రఘురామిరెడ్డిని తన ‘ఆంతరంగిక’ అధికారుల్లో ఒకరిగా నియమించుకున్నారు. రాజధాని భూములపై వేసిన ‘సిట్‌’కు ఆయనే అధిపతి. ‘స్కిల్‌’ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన అధికారి ఈయనే. ఇక.. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం కూడా కొల్లి చేతుల్లోనే ఉంది. ఆ హోదాలో తాము చెప్పినట్లు వినని అధికారులపై కొల్లి గురి పెట్టారనే ఆరోపణలున్నాయి. ఉన్న అధికారాలు చాలవని... ఆయనను ఔషధ నియంత్రణ మండలి డీజీగా కూడా నియమించారు. ఇటీవల టీడీపీ నేత, మాజీ మంత్రి పి.నారాయణ కళాశాల, నివాసంపై ఆ హోదాలోనే సోదాలు జరిపించారు. ఎన్నికల వేళ కొల్లి ద్వారా అటు తమ మాట వినని అధికారులు, ఇటు విపక్షాలను మరింతగా వేధించేందుకు జగన్‌ భారీ ప్రణాళిక రచించారనే ఆరోపణలున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో జగన్‌కు ఈసీ గట్టి దెబ్బ కొట్టింది.

Updated Date - Apr 09 , 2024 | 04:35 AM