Share News

ఆక్రమణల తొలగింపు కొంతేనా?

ABN , Publish Date - Nov 29 , 2024 | 11:42 PM

బి.కొత్తకోట నగరపంచాయతీలో ఏళ్ల తరబడి నాటుకుపోయిన కబ్జాలను కొంత వరకు తొలగించిన సంప న్నులు నివసించే ప్రాంతాలను వదలివేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నా యి.

ఆక్రమణల తొలగింపు కొంతేనా?
బి.కొత్తకోట జ్యోతి సర్కిల్‌లో ఆక్రమణలు తొలగిస్తున్న దృశ్యం(ఫైల్‌ఫొటో) బి.కొత్తకోటలో ఖరీదైన మదనపల్లె రోడ్డులో 30 అడుగులు కూడా లేని ప్రాంతం

బి.కొత్తకోటలో చిన్నపాటి తొలగింపులు అనామకులను ఖాళీచేయించి..సంపన్నులను వదిలేశారా? ఆర్‌అండ్‌బీ ఆక్రమణలు ఎలా?

బి.కొత్తకోట, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): బి.కొత్తకోట నగరపంచాయతీలో ఏళ్ల తరబడి నాటుకుపోయిన కబ్జాలను కొంత వరకు తొలగించిన సంప న్నులు నివసించే ప్రాంతాలను వదలివేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. నగరపంచాయతీ కమిషనర్‌ జీఆర్‌ పల్లవి పట్టణంలో ఆక్రమణల తొలగింపును సవాలుగా స్వీకరించి తొలగింపు కార్యక్రమానికి నూతన ఒర వడిని సృష్టించారు. ముఖ్యంగా జ్యోతిచౌక్‌, బెంగళూరు రోడ్డు సర్కిల్‌లలో ఆక్రమణలను తొలగించి నగరపంచాయతీ స్థలాన్ని, ప్రభుత్వ కట్టడాలకు విముక్తి కల్పించారు. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకువెళ్లారు. ఈ చర్యలలో పలువురు చిరు వ్యాపారులు ఉపాధిని కోల్పోయారు. పట్టణంలోని రంగసముద్రం రోడ్డు, బెంగళూరు రోడ్డు, పీటీ యం రోడ్డులలో డ్రైనేజి వరకు ఆక్రమణలను నిర్మొహమాటంగా తొలగిం చారు. దీనిపై క్రమంగా పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్లను రెవెన్యూశాఖ అప్పగించిన మేరకు రోడ్లు భవనాల శాఖ స్థలాన్ని తమ ఆధీనంలో ఉంచుకోలేదని, ముఖ్యంగా పట్టణ నడిబొడ్డున వెళ్లే మదనపల్లె రోడ్డు రెవెన్యూ స్కెచ మేరకు 60 అడుగులకు పైగా ఉండాలని ప్రస్తుతం అది 30 అడుగులు కూడా లేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డులో శ్రీమంతులు, బడావ్యాపారులు కాబట్టి తగు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలువస్తున్నాయి. అదే విధంగా రంగసముద్రంరోడ్డు, బెంగళూరు రోడ్డులో 100 అడుగులకు పైగా ఉండాలని దీనిపై అధికారులు ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై త్వరలో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూ టీ సీఎం పవనకళ్యాణ్‌లకు స్థానికులు కొందరు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

ఆర్‌ అండ్‌బీ స్థలం ఆక్రమణకు గురైంది వాస్తవమే

బి.కొత్తకోట పట్టణంలో ఆక్రమణల తొలగింపు విషయమై తహశీల్దార్‌ మహమ్మద్‌ అన్సారీని వివరణ కోరగా పూర్వం రోడ్లుభవనాల శాఖకు స్థలా న్ని కేటాయించగా ఇప్పుడు ఆ స్థలం అన్నాక్రాంతం అయిందన్నారు. తిరిగి ఆ స్థలం స్వాధీనం చేసుకోవడంలో ఆ శాఖావారు సహకరించాలని కోరితే తాము స్పందిస్తామన్నారు. ఇదిలాచ ఉండగా ఆర్‌అండ్‌బీ అధికా రులు త్వరలో రంగంలోకి దిగి ఆక్రమణల స్థలాన్ని స్వాధీనం చేసుకునే అవకావం ఉందని నగరపంచాయతీ అధికారులు పేర్కొం టున్నారు.

Updated Date - Nov 29 , 2024 | 11:42 PM