Share News

శ్రీసిటీ నుంచి 1,00,000వ మేడిన్‌ ఇండియా వాహనం

ABN , Publish Date - Dec 19 , 2024 | 04:02 AM

శ్రీసిటీలోని ఇసుజు మోటర్స్‌ ఇండియా పరిశ్రమ తమ ప్లాంట్‌లో తయారైన లక్షవ మేడిన్‌ ఇండియా వాహనాన్ని విడుదల చేసింది.

శ్రీసిటీ నుంచి 1,00,000వ మేడిన్‌ ఇండియా వాహనం

మైలురాయిని అధిగమించిన ఇసుజు మోటర్స్‌ ఇండియా

వరదయ్యపాళెం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): శ్రీసిటీలోని ఇసుజు మోటర్స్‌ ఇండియా పరిశ్రమ తమ ప్లాంట్‌లో తయారైన లక్షవ మేడిన్‌ ఇండియా వాహనాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా బుధవారం పరిశ్రమ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి యువరాజ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, టీహెచ్‌కే డిప్యూటీ ఎండీ, శ్రీసిటీ జపనీస్‌ కంపెనీగ్రూప్‌ చైర్మన్‌ సాడో గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ప్లాంట్‌లో లక్షవ వాహనం విడుదల పట్ల ఐఎంఐ అధ్యక్షుడు, ఎండీ రాజేష్‌ మిట్టల్‌ సంతోషం వ్యక్తంచేశారు. దేశ తయారీ నైపుణ్యం, ప్రపంచ పోటీతత్వానికి సాక్ష్యం ఈ కార్యక్రమమని యువరాజ్‌ అభివర్ణించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, పరిశ్రమల శాఖ మంత్రి టీడీ భరత్‌ అభినందన సందేశాలను చదివి వినిపించారు.

Updated Date - Dec 19 , 2024 | 04:02 AM