Share News

Jagan: చంద్రబాబు చంద్రముఖిలా మారాడు

ABN , Publish Date - Dec 20 , 2024 | 06:04 AM

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు, చంద్రముఖిలా మారిపోయాడు’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు.

Jagan: చంద్రబాబు చంద్రముఖిలా మారాడు

కుంభకోణాలకు రాష్ట్రం కేరా్‌ఫగా మారింది

రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది.. వైసీపీ నేతలు గొంతు విప్పాలి: జగన్‌

అమరావతి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు, చంద్రముఖిలా మారిపోయాడు’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని తన నివాస ప్రాంగణంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ‘రాష్ట్రంలో ఇసుక, లిక్కర్‌ మాఫియా నడుస్తోంది. కుంభకోణాలకు రాష్ట్రం కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిపోయింది. ఇలాంటి సమయంలో వైసీపీ నేతలంతా గొంతు విప్పాలి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని నిలదీయాలి. వైసీపీ నేతలందరికీ నేను, పార్టీ అండగా ఉంటాం. నాయకులుగా ఎదగడానికి ఇది ఒక అవకాశం. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని లేపడమే. పులినోట్లో తలపెట్టడమే. నేను ఎన్నికల సమయంలో ఇదే చెప్పా. ఈరోజు అవన్నీ నిజమవుతున్నాయి. వైఎస్‌ జగన్‌ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యాని పెడతాడని ప్రజలు భావించారు. ఇప్పుడు ఈ రెండూ పోయాయి. ఉన్న పథకాలు పోయాయి... ఇస్తానన్న పథకాలూ అమలు చేయడం లేదు. రాష్ట్రంలో కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు... నేతలంతా నీకింత, నాకింత అని పంచుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీకి సానుకూలంగా మారాలంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. ఆ దిశగా పార్టీ నేతలు అడుగులు వేయాలి’ అని జగన్‌ పిలుపునిచ్చారు.

Updated Date - Dec 20 , 2024 | 06:04 AM