Share News

Jagan : ప్రతిపక్షంలో కష్టాలు తప్పవు!

ABN , Publish Date - Oct 11 , 2024 | 04:05 AM

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు తప్పవని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Jagan : ప్రతిపక్షంలో కష్టాలు తప్పవు!

  • ఐదేళ్ల తర్వాత మనమే వస్తాం: జగన్‌

  • మోపిదేవి వెళ్లిపోవడం బాధాకరం.. రేపల్లె వైసీపీ నేతలతో భేటీ

అమరావతి-ఆంధ్రజ్యోతి/రేపల్లె, అక్టోబరు 10: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు తప్పవని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారమిక్కడ తాడేపల్లి ప్యాలెస్‌లో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. కష్టాలు కలకాలం ఉండవని.. త్వరలోనే మంచి రోజులు వస్తాయని వారితో అన్నారు. ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మళ్లీ వైసీపీయేనని జోస్యం చెప్పారు. కష్టసమయంలో పార్టీకి అంకితభావంతో వెన్నుదన్నుగా ఉన్నవారికి రానున్న రోజుల్లో పెద్దపీట వేస్తామని తెలిపారు.

మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావుకు సముచిత స్థానం కల్పించామని.. అయినా పార్టీని వీడడం బాధాకరమన్నారు. ఆయన ఓడిపోయినా మంత్రి పదవి ఇచ్చామని, రాజ్యసభకు పంపించామని చెప్పారు. మోపిదేవి సీఎం చంద్రబాబు సమక్షంలో ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాడేపల్లి భేటీకి రేపల్లె సమన్వయకర్త ఈపూరు గణేశ్‌, చెరుకుపల్లి ఎంపీపీ మత్తి దివాకర రత్నప్రసాద్‌ తప్ప ముఖ్య నేతలెవరూ హాజరు కాకపోవడంపై జగన్‌ అసహనం వ్యక్తంచేసినట్లు తెలిసింది. నియోజకవర్గంలోని వైసీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, రేపల్లె కౌన్సిలర్లు, పలువురు నాయకులందరూ మోపిదేవి వెంట వెళ్లిపోయారు.

Updated Date - Oct 11 , 2024 | 04:05 AM