Share News

రాష్ట్రంలో తిరిగే అర్హత జగనకు లేదు

ABN , Publish Date - Dec 08 , 2024 | 11:24 PM

రాష్ట్రంలో తిరిగే అర్హత జగనరెడ్డికి అదు అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.

   రాష్ట్రంలో తిరిగే అర్హత జగనకు లేదు
సమావేశంలో మాట్లాడుతున్న తిక్కారెడ్డి

26 లోపు సభ్యత్వాలు పూర్తి చేయాలి

ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లతో జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

కర్నూలు అర్బన, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తిరిగే అర్హత జగనరెడ్డికి అదు అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి టీజీ భరతతో కలిసి ఆయన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇనచార్జ్‌లు, కార్పొరేషన్ల డైరెక్టర్లతో సభ్యత నమోదు కార్యక్రమంపై సమీక్షించారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జగనరెడ్డి కాలయాపన రాజకీయాలకు చేస్తున్నారడని, ఆయన్ను ప్రజలే తిరస్కరించారన్నారు. గత ఐదేళ్ల కాలంలో పరదాల చాటున ప్రజల్లో తిరిగిన జగనకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,90,073 మంది సభ్యత్వాలు తీసుకున్నారని, ప్రతి నియోజకవర్గాంలో సభ్యత్వ నమోదును ఈనెల 26 లోపు పూర్తి చేసే దిశగా పని చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కేఈ శ్యామ్‌బాబు, బొగ్గుల దస్తగిరి, ఇనచార్జ్‌లు రాఘవేంద్ర రెడ్డి, వీరభద్రగౌడ్‌, కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, బోయ, కురువ కార్పొరేషన్ల చైర్మన్లు కప్పట్రాళ్ల బొజమ్మ, మాన్వి దేవేంద్రప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2024 | 11:24 PM