Share News

Janasena: తప్పు చేశా.. ప్రాయశ్చిత దీక్షకు సిద్ధం: నానాజీ

ABN , Publish Date - Sep 22 , 2024 | 08:07 PM

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కాకినాడ రూరల్ MLA పంతం నానాజీ సైతం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. శనివారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ వద్ద డాక్టర్‌పై ఎమ్మెల్యే దుర్భాషలాడారు.

Janasena: తప్పు చేశా.. ప్రాయశ్చిత దీక్షకు సిద్ధం: నానాజీ

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కాకినాడ రూరల్ MLA పంతం నానాజీ సైతం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. శనివారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ వద్ద డాక్టర్‌పై ఎమ్మెల్యే దుర్భాషలాడారు. దీనిపై తీవ్ర విమర్శలొచ్చాయి. తన తప్పును తెలుసుకుని దీనికి పరిహారంగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తన ఇంటి వద్ద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు నానాజీ స్వయంగా ప్రకటించారు.


దిగివచ్చిన నానాజీ..

కాకినాడ రంగరాయ వైద్య కళాశాల(ఆర్‌ఎంసీ) ఫొరెన్సిక్‌ విభాగాధిపతి, కాలేజీ స్పోర్ట్స్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఉమామహేశ్వరరావుపై దౌర్జన్యానికి దిగి, బూతులు తిట్టిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దిగివచ్చారు. క్షమాపణలు చెప్పారు. ‘‘ కేసు ఫైల్ చేయొద్దని కూడా నేను అడగడం లేదు. నేను వైద్య వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడలేదు. అలా ఎవరీతోనూ, ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. వైద్య వృత్తికి క్షమాపణలు చెబుతున్నాను’’ అని ఆయన ప్రకటించారు.

దాడికి గురైన డాక్టర్‌ ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ.. కేసు పెడుతున్నామని చెప్పారు. రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సమ్మెలు చేయవద్దని విద్యార్థులకు సూచించారు. ‘‘రెండు మూడు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ముందుగా నేరస్థులను గుర్తించాలి. నేను ఫిర్యాదు చేస్తాను. నాతో పాటు దెబ్బలు తిన్న విద్యార్థులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారి మీద నాకు కోపం, కసి లేవు. కానీ పది మంది మధ్య చేసిన పని బాలేదు’’ అని విచారం వ్యక్తం చేశారు.

Updated Date - Sep 22 , 2024 | 09:34 PM