యేసు మార్గం ఆచరణీయం
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:35 AM
రుణామయుడు యేసుక్రీస్తు చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని పలువురు క్రైస్తవ మతపెద్దలు పిలుపునిచ్చారు.
క్రైస్తవ మత పెద్దల ఉద్బోధన
ఘనంగా ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు
కర్నూలు కల్చరల్, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): కరుణామయుడు యేసుక్రీస్తు చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని పలువురు క్రైస్తవ మతపెద్దలు పిలుపునిచ్చారు. శాంతియుత జీవన మార్గమే ఆ మహనీయుడు లోకానికి ఇచ్చిన గొప్ప సందేశమని బోధించారు. శాంతి, సహనం, సద్భావనలతో సమాజంలో ప్రతిఒక్కరూ కలిసిమెలసి జీవించాలని, ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలన్నారు. యేసుక్రీస్తు జన్మదిన వేడుక ‘క్రిస్మన’ను బుధవారం క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక క్రిస్మస్ ప్రార్థనలు చేశారు. ఆయా చర్చిలకు సంబంధించిన మతపెద్దలు క్రీస్తు సందేశాన్ని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ పాపాల విముక్తికి తపిస్తారని, క్రీస్తు ప్రభువు పాపభీతిని రూపుమాపి అందరికీ ప్రేమ, శాంతి, త్యాగాన్ని పంచి, మానవుల జీవితానికి ఒక మంచి సుగుణాన్ని అందించారని చెప్పారు.