vc jntu విద్యార్థులకు జేఎనటీయూ వరం
ABN , Publish Date - Sep 25 , 2024 | 11:26 PM
టెక్నికల్ ఎడ్యుకేషనకు మౌలిక సదుపాయాలు కల్పించిన జేఎనటీయూ ఈ ప్రాంత విద్యార్థులకు వరమని కియ ప్రతినిధులు ప్రశంసించారు. ఇనచార్జి వీసీ ప్రొఫెసర్ సుదర్శనరావు ఆధ్వర్యంలో కియ ప్రతినిధులు హాంగ్‌సంగ్ పార్క్, హంగు కిమ్, శ్రీహాసన వర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాలను బుధవారం సందర్శించారు.
కొనియాడిన కియ ప్రతినిధులు
వర్సిటీతో ఎంఓయూకు అంగీకారం
హర్షం వ్యక్తం చేసిన ఇనచార్జి వీసీ
అనంతపురం సెంట్రల్, సెప్టెంబరు 25: టెక్నికల్ ఎడ్యుకేషనకు మౌలిక సదుపాయాలు కల్పించిన జేఎనటీయూ ఈ ప్రాంత విద్యార్థులకు వరమని కియ ప్రతినిధులు ప్రశంసించారు. ఇనచార్జి వీసీ ప్రొఫెసర్ సుదర్శనరావు ఆధ్వర్యంలో కియ ప్రతినిధులు హాంగ్‌సంగ్ పార్క్, హంగు కిమ్, శ్రీహాసన వర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాలను బుధవారం సందర్శించారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ల్యాబ్‌లు, సీమెన్స ల్యాబ్, స్కిల్ డెవల్‌పమెంట్ విభాగాన్ని వారు పరీశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వీసీ సుదర్శన రావు మాట్లాడుతూ, మెకానికల్, ఎలకి్ట్రకల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కియ సంస్థలో ఇంటర్న్‌షిప్ చేయడానికి అవకాశం ఉందని అన్నారు. కియను ఫ్యాకల్టీ సందర్శించి, అక్కడి పనులపై పరిశోధనలు చేయవచ్చునని తెలిపారు. రియల్ టైమ్ సమస్యలను పరిష్కరించడానికి, ప్రాజెక్టులు చేయడానికి కియలో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవడానికి కియతో ఒప్పంద కుదుర్చుకునేందుకు ఆహ్వానం పలికామని అన్నారు. కియ ప్రతినిధులు వర్సిటీని సందర్శించి, ఎంఓయూకు ఒప్పుకోవడం శుభపరిణామమని అన్నారు. కియ, జేఎనటీయూ పరస్పర సహకారంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చునని అన్నారు. ఆ దిశగా గతంలో ప్రయత్నాలు జరగలేదని, దీంతో ఆ సంస్థ ప్రతినిధులు వర్సిటీకి రాలేదని అన్నారు. తొలి సందర్శనలోనే జేఎనటీయూ సేవలను వినియోగించుకునేందుకు కియ ప్రతినిధులు సముఖత వ్యక్తం చేశారని అన్నారు. కార్యక్రమంలో వీసీ ఓఎ్‌సడీ ప్రొఫెసర్ దేవన్న, రిజిసా్ట్రర్ ప్రొఫెసర్ క్రిష్ణయ్య, ప్లేస్‌మెంట్ డైరెక్టర్ విశాలి, ప్రిన్సిపాల్ చెన్నారెడ్డి, కియ ప్రతినిధులు ఉపాశంకర్ పట్నాయక్, రమే్‌షబాబు, విజయ పాయ్, డీఏపీ కో ఆర్డినేటర్ అరుణ మస్తాని, హెచఓడీలు కళ్యాణిరాధ, రామశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.