వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తు
ABN , Publish Date - Sep 09 , 2024 | 12:02 AM
వినాయక చవి తి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసి న వినాయక విగ్రహాల నిమజ్జన ర్యాలీ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాయచోటి ఇనఛార్జ్ డీఎస్పీ ఎన.సుధా కర్ తెలిపారు.
పీలేరు, సెప్టెంబరు 8: వినాయక చవి తి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసి న వినాయక విగ్రహాల నిమజ్జన ర్యాలీ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాయచోటి ఇనఛార్జ్ డీఎస్పీ ఎన.సుధా కర్ తెలిపారు. పీలేరు పట్టణంలో వినాయక విగ్రహాల నిమజ్జన ర్యాలీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ప్రత్యేకమై నది. పట్టణంతోపాటు పీలేరు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే విగ్రహాలన్నీ ఒకేరోజు స్థానిక అయ్యపనాయుని చెరువులో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. పీలేరు లో బుధవారం వినాయక నిమజ్జన ర్యాలీ ప్రధాన రహదారి అయిన ఎల్‌బీఎస్ రోడ్డుతో పాటు నెహ్రూబజారు, బ్రాహ్మణ వీధి గూండా నిర్వహించి విగ్రహాలను చెరువులో నిమ జ్జనం చేస్తుంటారు. ఈ నిమజ్జన ర్యాలీ బందోబస్తు కోసం జిల్లా కేంద్రం నుంచి అదనపు బలగాలతోపాటు వాల్మీకిపురం, కలకడ, పీలేరు రూరల్ సర్కిళ్ల పరిధిలోని సిబ్బందిని కూడా రప్పిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిమజ్జన ర్యాలీని ఉదయం 10 గంటలకు ప్రారం భించి రాత్రి వీలైనంత త్వరగా ముగించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేర కు ఆదివారం సాయంత్రం ఆయన పట్టణంలోని వినాయక కేంద్రాల నిర్వాహకులతో పీలే రు ఇనఛార్జ్ సీఐ రెడ్డిశేఖర రెడ్డి, ఎస్‌ఐ బాలకృష్ణతో కలిసి ప్రత్యేకంగా సమావేశమై పలు సూచనలు, సలహాలు అందించారు.