Share News

పవన్‌కళ్యాణ్‌ యువతకు ఆదర్శం

ABN , Publish Date - Sep 03 , 2024 | 12:12 AM

ఉప ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా పలుచోట్ల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మొక్కల పంపిణీ, రక్తదాన శిబిరం, అన్నదానం తదితర సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం కేకు కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.

పవన్‌కళ్యాణ్‌ యువతకు ఆదర్శం
రాజంపేటలో రక్తదాన శిబిరంలో పాల్గొన్న సబ్‌కలెక్టర్‌ నిధియాదేవి

పలుచోట్ల కూటమి నేతల అన్నదానం

కేకు కట్‌ చేసి సంబరాలు

ఉప ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా పలుచోట్ల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మొక్కల పంపిణీ, రక్తదాన శిబిరం, అన్నదానం తదితర సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం కేకు కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.

రాజంపేటటౌన్‌, సెప్టెంబరు 2: డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ జన్మదినోత్సవం సందర్భంగా నియోజకవర్గ జనసేనపార్టీ నాయకుడు అతికారి కృష్ణ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. సిద్దవటం నుంచి హైవే రోడ్డు మీదుగా జనసేనపార్టీ కార్యకర్తలు, నాయకులు, పవన్‌కళ్యాణ్‌ అభిమానులతో మోటారు సైకిల్‌పై ర్యాలీ నిర్వహిస్తూ రాజంపేట మండలంలోని భువనగిరిగుట్టకు చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భువనగిరిగుట్టపై చెట్లు నాటారు. ఈ సందర్భంగా భారీ బాణాసంచా పేల్చారు. పెద్దఎత్తున గజమాలలతో అతికారి కృష్ణను స్వాగతించారు. అనంతరం పాతబస్టాండు కూడలిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు గుల్జార్‌బాషా, టీడీపీ నేతలు లక్ష్మీనారాయణ, సంజీవరావు, వెంకటేశ్వర్లునాయడు, మాజీ సర్పంచ్‌లు అరుణాచలం, ఎంఎల్‌ నారాయణ, భువనగిరిపల్లె ఆలయ ధర్మకర్త టైల్స్‌ నరసింహ, గీతాంజలి విద్యాసంస్థల అధినేత ఎస్వీ రమణ, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ విజయసాగర్‌, అబ్బిగారి గోపాల్‌, భువనగిరిపల్లె చుట్టుపక్కల గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరం

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా రాజంపేట పార్లమెంట్‌ జనసేన నాయకుడు యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని రాజంపేట సబ్‌కలెక్టర్‌ వైఖోమ్‌ నిధియాదేవి ప్రారంభించి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజంపేట పార్లమెంట్‌ బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేష్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ చెన్నూరు సుధాకర్‌, డాక్టర్‌ బాలరాజు, బీవీఎన్‌ రాజు, బీసీ నాయకులు మల్లెల సుబ్బరాయుడు, మాజీ జడ్పీటీసీ యల్లటూరు శివరామరాజు, వీరమహిళ రెడ్డిరాణి, సీఐలు ఎల్లమరాజు, రామాంజనేయుడు తదితరులు పాల్గొన్నారు.

రాజంపేటటౌన్‌: రాజంపేట నియోజకవర్గ సీనియర్‌ నాయకుడు చెంగారి శివప్రసాద్‌ ఆధ్వర్యంలో క్లీన్‌ గ్రీన్‌ కార్యక్రమం నిర్వహించారు. రాజంపేటలోని బోయపాలెం వీధి రహదారిలోని చెత్తను చీపుర్లతో తొలగించి పరిశుభ్రంగా ఉంచారు. బైపా్‌సలో జనసేన పార్టీ సిద్ధాంతం పర్యావరణం పరిరక్షణ కొరకు మొక్కలు నాటడం జరిగిందని శివప్రసాద్‌ తెలియజేశారు. కార్యక్రమంలో కేవీ రమణ, పలుకూరి రవి, శంకర్‌, నయని నవీన్‌, కార్మికులు రాఘవేంద్ర, లోకేష్‌, రమేష్‌, విఠాష్‌ తదితరులు పాల్గొన్నారు.

రాయచోటిటౌన్‌: జనసేన అధినేత పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ నేతలు సోమవారం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రాయచోటి సమన్వయకర్త మయాన మహమ్మద్‌అలీ మాట్లాడుతూ నేటి కాలంలో రక్తదానం మహాదానంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

రైల్వేకోడూరు: రైల్వేకోడూరులోని ఓ ప్రైవేటు కన్వె న్షన్‌ హాలులో జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో అట్టహాసంగా ఉప ముఖ్య మంత్రి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. పారిశుధ్య కార్మికు లకు బట్టలు, పేద మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. యువకులు మెగా రక్తదానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ముక్కా రూపానందరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.

Updated Date - Sep 03 , 2024 | 12:12 AM