రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Oct 08 , 2024 | 11:54 PM
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ శనగ విత్తనాలను ప్రతి రైతూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే క్రిష్ణచైతన్యరెడ్డి తెలిపారు.
కమలాపురం రూరల్, అక్టోబరు 8 : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ శనగ విత్తనాలను ప్రతి రైతూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే క్రిష్ణచైతన్యరెడ్డి తెలిపారు. మంగళవారం మండల పరిఽధిలోని చిన్న చెప్పలి గ్రామంలో రాయితీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ విత్తనశుద్ధి చేసిన తరువాతే విత్తనం వేయాలన్నారు. వ్యవసాయశాస్త్రవేత్తల సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు. చిన్నచెప్పలి పంచాయతీకి రూ.65 లక్షల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీ పనులు మొదలుపెట్టామన్నారు. పనులు త్వరలో పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త మాధురి, ఏడీఏ నరసింహారెడ్డి, ఏఓ సరస్వతి, హౌసింగ్ ఏఈ వెంకటరెడ్డి, రాఘవరెడ్డి, కంకరసుబ్బారెడ్డి, దివాకర్‌రెడ్డి, జంపాల నరసింహారెడ్డి, నాగిరెడ్డి, రామ్మోహనరెడ్డి, యల్లారెడ్డి, రైతు సంఘం నాయకుడు పాల్గొన్నారు.