దేశభాషలందు తెలుగులెస్స
ABN , Publish Date - Aug 29 , 2024 | 11:25 PM
దేశభాషలందు తెలుగులెస్స‘ అంటూ తెలుగు వ్యవ హారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వ హించారు.
పీలేరులో ర్యాలీ నిర్వహిస్తున్న
మెయిన స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు
తంబళ్లపల్లెలో గిడుగు, ధ్యానచంద్‌లకు నివాళులర్పిస్తున్న ప్రిన్సిపాల్
ఫ ఘనంగా మాతృభాషా దినోత్సవ వేడుకలు ఫ తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగుకు ఘననివాళి
పీలేరు, ఆగస్టు 29:’దేశభాషలందు తెలుగులెస్స‘ అంటూ తెలుగు వ్యవ హారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వ హించారు. పీలేరు పట్టణంతోపాటు మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లోని పిల్లలు సాంప్రదాయ దుస్తులు ధరించి తెలు గు తల్లి, తెలుగు కవుల వేషధారణలో ర్యాలీలు నిర్వహించారు. తెలుగు భాష తల్లిలాంటిదని, దానిని నిర్లక్ష్యం చేయబోమని నినాదాలు చేశారు. విద్యార్థుల ర్యాలీలతో పీలేరులో పండుగ వాతావరణం నెలకొంది. పీలే రు తెలుగు భాషా సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలో పలువురు ప్రముఖ కవులతో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వ హించారు. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వేంపల్లె అబ్దుల్ ఖాద ర్ మాట్లాడుతూ సమాజ హితమే సాహిత్య ప్రయోజనమని, ప్రజలకు ఉపయోగపడేందుకే గిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాషను సృష్టిం చాడని తెలిపారు. అనంతరం తెలుగు వ్యాసరచన, వక్తృత్వ, సాంస్కృ తిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అంతకుమునుపు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృ తిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అంతకుమునుపు స్థానిక మెయిన స్కూల్ హెచఎం సురేంద్రనాథరెడ్డి నేతృత్వంలో అక్కడి ఉపాధ్యాయులు తెలుగు భాషా సమితి సభ్యులు జలకనూరి మురళీ ధర్‌రాజు, సరస్వతి శ్రీరాములు రాజును ఘనంగా సన్మానించారు. వేర్వే రుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో రిటైర్డు తెలుగు అధ్యాపకుడు అన్న య్య నాయుడు విద్వాన ప్రసాద్, ఎంఈవోలు లోకేశ్వర్ రెడ్డి, పద్మావతి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, తెలుగు భాషా సమితి సభ్యు లు, హెచఎంలు నటరాజన, గంగాధర్, తెలుగు అధ్యాపకులు నరసిం హులు, శ్రీనివాసులు రెడ్డి, రజనీ, ఎల్లయ్య, సురేశ, రామచంద్ర, తెలుగు ఉపాధ్యాయులు రాజన్న, శచీదేవి, రేణుక, షరీఫ్, బీవీ రమణ, రామ్మూ ర్తి, రమణయ్య, ఫరూఖ్, తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకిపురంలో: వాల్మీకిపురం పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకు న్నారు. ఈసందర్భంగా గిడుగు వెంకటరామమూర్తి పంతులకు నివాళు లర్పించి పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. హెచఎం సావిత్రి, ఉపా ధ్యాయులు ఉషారాణి, నాగరాజ, చంద్రశేఖర్, చారాదేవి పాల్గొన్నారు.
ములకలచెరువులో: మండలంలో గురువారం తెలుగుబాషా దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పాఠశాల్లో వేడుకలు నిర్వహించారు. అలాగే వేపూరికోటలోని ఎస్వీ ప్రైవేటు పాఠ శాలలో విద్యార్ధులు తెలుగుతల్లి అలంకణతో ఆకట్టుకున్నారు. కరెస్పాం డెంట్ బీఎన గోపాల్‌రెడ్డి తెలుగుభాషా దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్ధులకు వివరించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలకడలో:తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించిన గిడుగు రామూర్తి సేవలు చిరస్మరణీయమని కోన హైస్కూల్ హెచఎం చెంగల్‌రాయులు, ఆదర్శపాఠశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్‌లు పేర్కొ న్నారు. గురువారం మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఘనంగా ర్యాలీ నిర్వహించి ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలపై పోటీలను నిర్వ హించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిమ్మనపల్లిలో: స్థానిక జడ్పీ హైస్కూల్‌లో గురువారం ఘనంగా తెలుగు భాషా హెచఎమ్ అంజాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంధర్బంగా విద్యార్థులు స్థానిక బస్టాండు కూడలిలో ర్యాలీ నిర్వహించి తెలుగు బాషా పండితులు గిడుగు రామమూర్తి, తెలుగు కవుల గురించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపాల్, శ్రీవాణి, రేణుక, తనూజ, వీరబద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
తంబళ్లపల్లెలో: అమ్మ లాంటి మాతృబాషను ప్రతి ఒక్కరూ అలవా టు చేసుకోవాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ హేమంతకుమార్ విద్యా ర్థులకు సూచించారు. గురువారం తెలుగు బాషా దినోత్సవం మోడల్ స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులు వేసిన చెక్కభజనలు, కోలాటలు, ఎంతగానో ఆకట్టుకు న్నాయి. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన వాణీశ్వరీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పెద్దమండ్యంలో: తేనెలొలుకు భాష మన తెలుగు భాష అని పెద్ద మండ్యం ఎంఈవోలు మనోహర్, రామకృష్ణ పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకొని మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గిడుగు వెంకట రామ్మూర్తి చిత్రపటానకి ఉపాధ్యాయు లు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్దమం డ్యం, యల్లంవారిపల్లి, కలిచెర్ల , వెలిగల్లు, మోడల్ స్కూల్లో తెలుగు భాషా దినోత్సవం ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ప్రిన్సిపాల్ రామాం జులునాయుడు, హెచఎంలు అమీన, రామచంద్రా, తెలుగు ఉపాధ్యా యలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కలికిరిలో: మాతృభాషను ఆదరించాలని కలికిరి ప్రభుత్వ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అంజలీదేవి పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గురువారం కళాశాలలో జరిగిన కార్యక్ర మంలో ఆమె మాట్లాడుతూ తెలుగు భాషకున్న చరిత్ర ప్రపంచంలోనే అతి గొప్పదని కొనియాడారు.ఈ సందర్భంగా వ్యాస, వక్తృత్వ, పాట, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అంజలీ దేవితోపాటు వైస్ ప్రిన్సిపాల్ గులాబ్ జాన, అధ్యాపకులు మాధవి, స్వర్ణలత, ఉదయ, లిఖిత, జి.మాధవి, హాజీరా, శైలజ, కీర్తి, అనూష, దేవి, రమణ పాల్గొన్నారు.
బి.కొత్తకోటలో: బి.కొత్తకోట మండలంలో తెలుగుభాషా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆదర్శ పాఠశాలలో గిడుగురామ్మూర్తి పంతులు చిత్రపటానికి నివాళులర్పించారు. గిడుగు రామ్మూర్తి, క్రీడామాంత్రికుడు ధ్యానచంద్‌ల జయంతిని పురస్కరిం చుకుని విధ్యార్థులకు పద్యపఠనము, వ్యాసరచన, చిత్రలేఖనం, క్రీడాపో టీలను నిర్వహించి ప్రతిభ చూపిన వారికి బహుమతిప్రదానం చేశారు. ఎంఈవో రెడ్డిశేఖర్, ప్రిన్సిపాల్ శ్రీనూనాయక్ పాల్గొన్నారు. కార్యక్రమంలో స్కూల్ కమిటీ ఛైర్మన వెంకట్రమణ, నాయకులు కుడుం శ్రీనివాసులు, నారాయ ణస్వామిరెడ్డి, ఉపాధ్యాయులు హనుమంతరెడ్డి, ప్రత్యూష,సాయిలీల, గాయిత్రి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దతిప్పసముద్రంలో: అమ్మలాంటి మాతృభాషను అందరూ అలవా టు చేసుకోవాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ శివకుమారి విద్యార్థులకు సూచించారు. గురువారం స్థానిక ఆదర్శ పాఠశాలలో తెలుగుభాషా క్రీడా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తెలుగు భాషకు పాటుబడిన ఉద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి, హాకి ఆటగాడు ద్యానచంద్, తెలుగుతల్లి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఎస్‌ఎంసీ చైర్మన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఘనంగా మాతృభాషా దినోత్సవ వేడుకలు తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగుకు ఘననివాళి