Share News

అక్రమార్కులపై ఆప‘రేషన్‌’

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:44 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉక్కుపాదంతో కాకినాడలో రేషన్‌ మాఫియా వణుకుతోంది. గత ప్రభుత్వ సహకారంతో ఐదేళ్లపాటు యథేచ్ఛగా పేదల బియ్యాన్ని పాలిష్‌ చేసి విదేశాలకు తరలించేసిన అక్రమా ర్కులు ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విలవిల్లా డుతున్నారు.

అక్రమార్కులపై ఆప‘రేషన్‌’
కాకినాడ పోర్టు రోడ్డులోని ఓ గోదాములో బియ్యం నిల్వలు(ఫైల్‌)

  • రేషన్‌ బియ్యం మాఫియాపై అంతకంతకూ ఉచ్చుబిగిస్తున్న కొత్త ప్రభుత్వం

  • జిల్లా నుంచి విదేశాలకు పోర్టు ద్వారా బియ్యం తరలకుండా పగడ్బందీ చర్యలు

  • ఒకపక్క కొత్తగా చెక్‌పోస్టులు, మరోపక్క గోదాములపై క్రిమినల్‌ కేసులతో స్పీడ్‌

  • ఇకపై ఇతర ప్రాంతాలనుంచి కాకినాడకు వచ్చే బియ్యంపై పూర్తిస్థాయి నిఘా

  • చెక్‌పోస్టుల్లో పోలీసు, రెవెన్యూ, పోర్టు, పౌరసరఫరాలశాఖ అధికారుల బృందం

  • యాంకరేజ్‌ పోర్టు పరిసరాల్లో ఎక్కడెక్కడ ఎన్ని ఏర్పాటు చేయాలనేదానిపై కలెక్టర్‌ కసరత్తు

  • రేషన్‌ మాఫియాను మట్టుపెట్టాలన్న ప్రభుత్వ పట్టుదలతో కొన్నిరోజులుగా అధికారులు పరుగో పరుగు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వ ఉక్కుపాదంతో కాకినాడలో రేషన్‌ మాఫియా వణుకుతోంది. గత ప్రభుత్వ సహకారంతో ఐదేళ్లపాటు యథేచ్ఛగా పేదల బియ్యాన్ని పాలిష్‌ చేసి విదేశాలకు తరలించేసిన అక్రమా ర్కులు ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విలవిల్లా డుతున్నారు. విదేశాలకు రేషన్‌ బియ్యాన్ని ఏమాత్రం జంకుగొంకు లేకుండా ఇన్నాళ్లు ఎగుమతి చేసిన వీరికి ఇప్పుడు దారులన్నీ మూ సుకుపోతుండడంతో ఆపసోపాలు పడుతున్నారు. అధికారుల కళ్లు గప్పి విదేశాలకు తరలించే ప్రయత్నాలు కష్టమవడంతో ఉక్కిబిక్కిరి అవుతున్నారు. కొన్నిరోజులుగా కాకినాడనుంచి విదేశాలకు ఎగుమత వుతున్న రేషన్‌ బియ్యంపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. మాఫియాను మట్టు పెట్టడంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులోభాగంగా ఇటీ వల రేషన్‌బియ్యం ఆనవాళ్లు గుర్తించిన గోదాములపై తాజాగా క్రిమి నల్‌ కేసులు నమోదు చేసింది. పోర్టు పరిసరాల్లో త్వరలో చెక్‌పోస్టు లు ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందులో పలుకీలక శాఖల అధికారు లను భాగస్వామ్యం చేయబోతోంది. రేషన్‌ బియ్యం రూపు మార్చు కునేది మిల్లుల్లోనే కాబట్టి అక్కడా నిఘావేసే అంశంపై పరిశీలి స్తోంది. యాంకరేజ్‌పోర్టు నుంచి విదేశాలకు ఇన్నేళ్లలో తరలిపోయిన బియ్యం లెక్కలు కూడా కూపీ లాగుతోంది. అటు రేషన్‌బియ్యం మా ఫియాను మట్టుపెట్టాలన్న ప్రభుత్వ పట్టుదలతో అధికారులు సైతం ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

అడ్డూ అదుపూ లేదంతే...

కాకినాడ కేంద్రంగా రేషన్‌బియ్యం విదేశాలకు కొన్నేళ్లుగా యథేచ్ఛ గా తరలిపోతోంది. యాంకరేజ్‌పోర్టు నుంచి లక్షల టన్నుల బియ్యం అక్రమంగా రూపుమార్చుకుని సముద్రాలు దాటేస్తోంది. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రేషన్‌ దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, ఆయన అనుచరులు లక్షల టన్నుల బియ్యాన్ని ఓడల్లో తరలించేశా రు. రేషన్‌బియ్యాన్ని వైసీపీ అండదండలున్న పలువురు వ్యాపారులు రూ.6కి కొనుగోలు చేసి కాకినాడకు లక్షల టన్నుల్లో అయిదేళ్లుగా భారీగా తరలించారు. వీటిని ద్వారంపూడి కుటుంబం, ఆయన మను షులు కొనుగోలు చేసి మిల్లుల్లో నిల్వచేసి ఆనక ఆ బియ్యాన్ని పాలి ష్‌ చేసి కిలో రూ.56 చొప్పున విదేశాలకు కాకినాడ యాంకరేజ్‌పోర్టు నుంచి ఎగుమతి చేసి కోట్లకు కోట్లు సంపాదించారు. ఇదంతా తెలిసినా భయంతో అధికార వ్యవస్థలు ఏం చేయలేక నిస్సహాయం గా మారాయి. ఎక్కడ దాడిచేసి రేషన్‌బియ్యాన్ని పట్టుకున్నా ఉద్యోగా లు పోతాయన్న భయంతో మాఫియాను వదిలేశాయి. ఇదేఅదనుగా జిల్లా నుంచి భారీగా బియ్యం విదేశాలకు తరలిపోయింది. అధికారు ల భయం లేకపోవడంతో జిల్లాలో అనేక మిల్లుల్లో వేల టన్నుల రేషన్‌బియ్యాన్ని నిల్వ చేసి పాలిష్‌ చేసి సంచులు మార్చి వేరే కొత్త పేరుతో విదేశాలకు తరలించేశారు. యాంకరేజ్‌పోర్టు నుంచి అనుకు న్నంత వేగంగా విదేశాలకు బియ్యం వెళ్లడం లేదన్న సాకుతో గత ప్రభుత్వంలో ద్వారంపూడి బియ్యం ఎగుమతులను డీప్‌వాటర్‌ పోర్టు ద్వారా ప్రత్యేక అనుమతులు తీసుకుని తరలించేశారు. ఒకరకంగా చెప్పాలంటే గోదాములు, మిల్లుల్లో రేషన్‌బియ్యం నిల్వలున్నా అడిగే వారు లేరన్న ధీమాతో రెచ్చిపోయారు. పరిస్థితులు మారి కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రేషన్‌బియ్యం మాఫి యాపై ప్రత్యేక దృష్టిసారించింది. పేదల బియ్యం పక్కదారి పట్టకుం డా ఉచ్చుబిగించింది. ఇక్కడినుంచి విదేశాలకు అక్రమంగా పాలిష్‌ చేసి ఎగుమతి చేస్తున్న అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతోంది. అందులోభాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ ఆదేశా లతో స్వయంగా మంత్రి నాదెండ్ల కాకినాడకు వచ్చి పోర్టుతో సహా గోదాములన్నీ తనిఖీ చేశారు. 13 గోదాముల్లో నిల్వలను గుర్తించి వాటి శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించారు. సీజ్‌ చేసిన 50,647 మెట్రిక్‌ టన్నుల బియ్యంలో 26,488 మెట్రిక్‌ టన్నుల రేషన్‌బియ్యం ఆనవాళ్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తాజాగా 13 గోదాముల యాజమాన్యా లపై పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. దీంతో ఇప్పుడు కాకినాడ పోర్టు పరిసరాల్లో ఉన్న అనేక గోదాముల నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. ఎప్పుడు ఏ సోదాలు జరుగుతాయోనని అక్ర మార్కులు వణుకుతున్నారు. మరోపక్క కేవలం దాడులు చేసి చేతు లు దులిపేసుకోకుండా శాశ్వతంగా రేషన్‌మాఫియాకు చెక్‌ పెట్టేం దుకు త్వరలో చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ షాన్‌మోహన్‌ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. వివిధ జిల్లాలు, రాష్ట్రాలనుంచి నేరుగా వేలాది లారీల్లో బియ్యం యాంకరేజ్‌ పోర్టుకు వస్తున్న నేపథ్యంలో వీటిపై నిఘా పెట్టేందుకు చెక్‌పోస్టుల అస్త్రం వాడుతున్నారు. ఈ చెక్‌పోస్టులను దాటుకునే బి య్యం లారీలు గోదాములకు వెళ్లాల్సి ఉంటుంది. తద్వారా అను మా నం వచ్చిన లారీలన్నింటినీ పక్కాగా తనిఖీ చేయనున్నారు. చిన్న రేషన్‌బియ్యం ఆనవాళ్లు దొరికినా లారీ సీజ్‌తోపాటు ఎవరి పేరుతో బియ్యం రవాణా అయిందో వారిపైనా క్రిమినల్‌ కేసులు పెట్టేలా చ ర్యలు చేపడుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే చెక్‌పోస్టుల్లో పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాలు, పోర్టు అధికారులతో కూడిన బృందాన్ని నియమించనున్నారు. పోర్టుకు వచ్చే దారులన్నింటిలోను వీటిని ఏర్పాటు చేయడానికి కలెక్టర్‌ సన్నాహాలు ప్రారంభించారు.

అధికారులు పరుగో.. పరుగు..

రేషన్‌బియ్యం మాఫియాను ఇంతకాలం అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. కొందరు అధికారులు ముడుపులు తీసుకోవడం, అటు ప్రభుత్వపెద్దల భయంతో చూసీచూడనట్లు వదిలేశారు. కానీ కొత్త ప్రభుత్వం మాత్రం రేషన్‌బియ్యం మాఫియాను తీవ్రంగా పరిగణి స్తోంది. దీంతోనే స్వయంగా మంత్రి తనిఖీలకు రావడం, అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ అసెంబ్లీలోను, బయట ఈ విషయమై పలుసార్లు కూడా మాట్లాడారు. త్వరలో బియ్యం మాఫియాపై సీఐడీ విచారణకు కూడా ఆదేశించనున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం క్రిమినల్‌ కేసులు నమోదైన గోదాములతోపాటు ఇతర గోదాముల్లోను మరిన్ని తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ఐదేళ్లపాటు విదేశాలకు యాంకరేజ్‌పోర్టు నుంచి రవాణా అయిన బియ్యం విలువ వివరాలు సేకరించారు. దాదాపు రూ.800కోట్లకు పైగానే విలువైన రేషన్‌ తరలిపోయిందని గుర్తించారు. దీంతో ఇటీ వల పట్టుబడ్డ గోదాములనుంచి బియ్యం ఏ కంపెనీలు ఎగుమతి చేశాయి? వీటికి బియ్యం సరఫరా చేసింది ఎవరు? వంటి వివరా లను కూడా కూపీ లాగుతున్నారు. రేషన్‌బియ్యానికి పాలిష్‌ చేసి విదేశాలకు ఎగుమతి కావడానికి వీలుగా ప్యాకింగ్‌ జరిగేది పూర్తిగా మిల్లుల్లోనే కాబట్టి అసలు మాఫియా అక్కడినుంచే మొదలవుతోంది. ఇదే విషయం ఇటీవల కలెక్టర్‌, ఎస్పీ, పోర్టు అధికారుల సమక్షంలో చర్చ జరిగింది. కాబట్టి అన్నిమిల్లుల్లో కాకపోయినా అనుమానాస్ప దంగా ఉన్నవి, నేతలకు సంబంధించిన వాటిపైనా ఓ కన్నేసి ఉంచా లని భావిస్తున్నారు. ఇదంతా ఒకెత్తయితే మిల్లుల విద్యుత్‌ బిల్లుల ఆధారంగాను రేషన్‌ బియ్యం మాఫియాను కొంతవరకు గుర్తించే అవకాశం ఉందని చెబుతున్నారు. మిల్లులకు ప్రభుత్వం ఇచ్చే సీఎం ఆర్‌కు అవసరమైన విద్యుత్‌కు మించి ఎక్కువ వాడకం జరిగితే లోపల అనుమానాస్పద వ్యవహారాలు జరిగే అవకాశం ఉన్నట్లు లెక్క. తద్వారా రేషన్‌ మాఫియాను ప్రారంభ దశలోనే గుర్తించి మట్టుపెట్టవచ్చనే దిశలోను అధికారులు ఆలోచిస్తున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 01:45 AM