శ్రీగిరి కిటకిట
ABN , Publish Date - Nov 18 , 2024 | 03:09 AM
నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
శ్రీశైలం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ క్యూలైన్లు, ప్రధాన వీధుల్లో రద్దీ నెలకొంది. వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, గంగమ్మకు దీపహారతులు, నైవేద్యాలు నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులుదీరారు. కార్తీకమాసం శని, ఆది, సోమవారం రోజుల్లో భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు.