Home » TTD
హిందూ దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులు ఉండడం వల్లే అభిప్రాయ భేదాలు వస్తున్నాయని, వారిని ఇతర శాఖల్లో పంపడమే మంచిదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు.
తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి ఇక్కడి ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.
తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ గురువారం విడుదల చేయనుంది.
టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు పూర్తి అర్హులని కిరాక్ ఆర్పీ ప్రశంసించారు. రోజా టూరిజం మంత్రిగా పనిచేసిన గత రెండున్నరేళ్లలో వేల టిక్కెట్లను దుర్వినియోగం చేశారని ఆయన కూడా చెప్పారని, విజిలెన్స్ శాఖకు కూడా ఆ విషయాన్ని అప్పగించారని తెలిపారు.
టీటీడీ పాలక మండలి పలు సంచలన నిర్ణయాలను తీసుకుంది. దీనిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ బోర్డు భక్తుల కోసం చాలా మంచి నిర్ణయాలు తీసుకుందని కిషన్రెడ్డి తెలిపారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని 2-3 గంటల్లోనే దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) నూతన ధర్మకర్తల మండలి నిర్ణయించింది. కొండపై విశాఖ శారదా పీఠం లీజును రద్దు చేసి భవనాన్ని స్వాధీనం చేసుకుని కూల్చివేయాలని నిశ్చయించినట్లు మండలి చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సోమవారం తిరుమలలో సమావేశమైంది. ఈ సందర్భంగా పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటైన తిరుపతి ప్రజలకు.. శ్రీవారిని దర్శించేందుకు ప్రతి నెలలో ఒక రోజు కేటాయించేందుకు టీటీడీ సుముఖత వ్యక్తం చేసింది.
తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లో క్లియర్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీనివాససేతు పేరుని గరుడ వారధిగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హరినాథ్, జస్టిస్ వినోద్ కుమార్ తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్నారు.
నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.