Share News

ఎమ్మిగనూరులో కార్తీక వనభోజనాల సందడి

ABN , Publish Date - Nov 24 , 2024 | 11:39 PM

ఎమ్మిగనూరు పట్టణంలో ఆదివారం కార్తీక వనభోజనాల సందర్భంగా ఆయా సామాజిక కులవర్గీయులు సందడి చేశారు.

ఎమ్మిగనూరులో కార్తీక వనభోజనాల సందడి
కార్తీక వనభోజన కార్యక్రమంలో మాట్లాడుతున్న రుద్రగౌడ్‌

ఎమ్మిగనూరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు పట్టణంలో ఆదివారం కార్తీక వనభోజనాల సందర్భంగా ఆయా సామాజిక కులవర్గీయులు సందడి చేశారు. పట్టణంలోని వీరశైవ కల్యాణ మండపంలో వీరశైవ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. అలాగే వైడబ్ల్యూసీఎస్‌ సొసైటీ ఆవరణంలో కుర్ణిదైవాచారం ఆధ్వర్యంలో కుర్ణికుల కార్తీక వనభోజనం కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఇండస్‌ స్కూల్‌లో కురువ వనభోజనం, భక్త కనకదాసు కార్యక్రమన్ని నిర్వహించారు. అలాగే ఆదోని రోడ్డులో ఉన్న విశాల గార్డెనలో కమ్మసంఘం ఆద్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సామాజిక వర్గాల కులబాందవులు ముందుగా ఉసిరి చెట్టుకు, కుదైవాలకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వీరశైవలింగాయత కార్పొరేషన మాజీ చైర్మన వై రుద్రగౌడ్‌, నాగరాజు గౌడ్‌, సంఘం నాయకులు విజయ్‌ కుమార్‌, మూర్తి, నాగరాజు గౌడ్‌, పరమేష్‌, కుర్ణి కుల బాందవులు మున్సిపల్‌ చైర్మన డా రఘు, టీడీపీ నాయకులు మాచాని సోంనాథ్‌, నాయకులు లింగప్ప, బుడ్డప్ప, ఉరుకుందు, నాగేశప్ప, నీలకంటలు పాల్గొన్నారు. అలాగే కురువ సంఘం నాయకులు మద్దిలేటి, బీరప్ప, రామకృష్ణ, గోపాల్‌లు పాల్గొన్నారు. కమ్మ సంఘం నాయకులు వెంకట్రావు, మహేంద్ర బాబు, భాస్కర్‌, ఉమాపతినాయుడు, ఎంసీకే దుర్గా ప్రసాద్‌, మనోహర్‌ చౌదరి, భాస్కర్ల చంద్రశేఖర్‌, మురళి, రామలింగప్ప, వీరేష్‌, నరసింహరావులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 11:39 PM