కేఎల్ వర్సిటీ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదల
ABN , Publish Date - Oct 02 , 2024 | 03:47 AM
కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంప్‌సలలో ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష-2025 పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
తాడేపల్లి, అక్టోబరు 1: కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంప్‌సలలో ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష-2025 పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష విధానం, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే రాయితీలు, స్కాలర్‌షి్‌పల గురించి యూనివర్సిటీ ప్రతినిధులను సీఎం అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థులు ఇటీవల సాధించిన ప్రగతి, ప్లేస్‌మెంట్ అంశాలపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వీసీ సారధివర్మ మాట్లాడుతూ యూనివర్సిటీ అందించే ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మూడు విడతలుగా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. మొదటి విడత ప్రవేశ పరీక్షను డిసెంబరు 6వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రోచాన్స్‌లర్ డాక్టర్ జగన్నాధరావు, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.