Share News

AP Elections 2024: ఎన్నికల బరి నుంచి కొడాలి నాని ఔట్!?

ABN , Publish Date - Apr 26 , 2024 | 01:53 PM

గుడివాడ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని.. ఇవే తనకు చివరి ఎన్నికలంటూ ఇటీవల ప్రకటించారు. అయితే కొడాలి నానికి గత ఎన్నికలే అంటే.. 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు అవుతాయని టీడీపీ నేతలు శుక్రవారం స్పష్టం చేశారు. ఈ ఎన్నికల వేళ.. కొడాలి నాని నామినేషన్ పత్రాలు సమర్పించారు. అందులో ఆయన తప్పుడు సమాచారం పొందు పరిచారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

AP Elections 2024: ఎన్నికల బరి నుంచి కొడాలి నాని ఔట్!?
Kodali Nani

గుడివాడ,ఏప్రిల్ 26: గుడివాడ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని.. ఇవే తనకు చివరి ఎన్నికలంటూ ఇటీవల ప్రకటించారు. అయితే కొడాలి నానికి గత ఎన్నికలే అంటే.. 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు అవుతాయని టీడీపీ నేతలు శుక్రవారం పేర్కొన్నారు. ఎన్నికల వేళ కొడాలి నాని నామినేషన్ పత్రాలు సమర్పించారు. అందులో ఆయన తప్పుడు సమాచారం పొందుపరిచారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Kothakota Srinivas: ఫోన్ ట్యాపింగ్‌పై హైదారాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు


ఈ అంశంపై రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని.. మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించారంటూ పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకిచ్చిన్నట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను ఫిర్యాదులో జత చేశారు. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చిన కొడాలి నాని నామినేషన్‌ను తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారిని కోరారు.

TDP: వైఎస్ షర్మిల నిన్న ఒక రహస్యం చెప్పారు: కనకమేడల


అయితే తాను ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని కొడాలి నాని సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రిటర్నింగ్ అధికారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ కొడాలి నానితో పాటు ఆయన అనుచరుల్లో ఉందని సమాచారం. మరోవైపు నామినేషన్ దాఖలు చేసే గడువు గురువారంతోనే ముగిసింది. ఒక వేళ రిటర్నింగ్ అధికారి కొడాలి నాని అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు తప్పు అని నిర్ధారిస్తే.. ఎన్నికల బరి నుంచి కొడాలి నాని తప్పుకొక తప్పదనే ఓ చర్చ సైతం నియోజకవర్గంలో కొనసాగుతుంది.

Sharees: పెరిగిన కంచి పట్టుచీరల ధరలు..


ఇక ఈ ఎన్నికల్లో కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని సైతం నామినేషన్ దాఖలు చేశారు. ఓ వేళ కొడాలి నాని నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తొసిపుచ్చితే.. కొడాలి చిన్ని అభ్యర్థిగా ఖరారు అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అలా కాని పక్షంలో కొడాలి నానినే అభ్యర్థి అయితే.. కొడాలి చిన్ని.. తన నామినేషన్ ఉపసహరించుకొనున్నారనే ఓ ప్రచారం సైతం ఫ్యాన్ పార్టీలో నడుస్తుంది.

Read National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 05:27 PM