Home » Kodali Nani
వైసీపీ అధినేత జగన్కు దమ్ముంటే ఇప్పుడు అమెరికా వెళ్లమనండి. ఇక జీవితాంతం ఆయన తిరిగి ఏపీకి రాలేరని తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో అడ్డగోలుగా వాగిన వారంతా జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందేనని బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)పై విశాఖ త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖ: నగరానికి చెందిన లా విద్యార్ధిని సత్యాల అంజన ప్రియ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలినానిపై ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం 3వ పట్టణ పోలీసు స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.
‘పిచ్చి వాగుడు మానుకో.. నోరు అదుపులో పెట్టుకో.. లేదంటే తరిమి తరిమి కొడతారు.’ ఇదీ మాజీ మంత్రి కొడాలి నానికి టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇచ్చిన మాస్ వార్నింగ్. తాజా ప్రెస్మీట్లో సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత కొడాలి నాని విమర్శలు చేయడంపై ...
విశ్వసనీయత లేని వైకాపా నేతలు మూర్ఖపు మాటలు ఆపకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎన్నడూ లేని విధంగా వరదల్లో మునిగి గుడివాడ ప్రజలు అష్టకష్టాలూ పడినప్పుడు ఎక్కడి పోయావు కొడాలి నాని అంటూ మండిపడ్డారు.
ఎన్నికల ముందు మాదే అధికారం అంటూ అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ నాయకుల ఆచూకీ కనబడటం లేదట. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. కనీసం కార్యకర్తలకు సైతం అందుబాటులో లేరట.
వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు..! ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరించారు..! టీడీపీ (Telugu Desam) కార్యకర్తలు మొదలుకుని నేతలు.. ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు..
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి (Former minister Kodali Nani) వరుస షాక్లు తగులుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో తాజాగా కొడాలి నానికు మరో ఎదురు దెబ్బ తగిలింది. కొడాలి నాని మరో భూ కబ్జా వెలుగులోకి వచ్చింది.
మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సన్నిహితుడు షా కీర్తికుమార్ జీవావత్కు చెందిన షా గులాబ్చంద్ జీవావత్ అండ్ కో పెట్రోలు బంకులో (Petrol Bunk) కల్తీ పెట్రోలు విక్రయం కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం 50 మందికి పైగా బైక్లలో 75 లీటర్ల మేర పెట్రోలు కొట్టించుకున్నారు..
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. కొందరు నేతల నోళ్లకు విశ్రాంతి లేకుండా పోయింది. ప్రతిరోజూ మీడియాలో కనిపిస్తూ.. అప్పటి విపక్ష నేతలపై నిత్యం అభ్యంతరకర పదాలతో విరుచుకుపడేవారు. రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం..