Share News

కష్టాల్లో కర్నూలు క్లస్టర్‌ వర్సిటీ..!

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:11 AM

దక్షిణ దేశంలో తొలి క్లస్టర్‌ విశ్వ విద్యాలయం అది. గత వైసీపీ ప్రభుత్వం అలసత్వం విద్యార్థులను శాపంగా మారింది.

   కష్టాల్లో కర్నూలు క్లస్టర్‌ వర్సిటీ..!
కర్నూలు నగర శివారులో జగన్నాథగట్టుపై అసంపూర్తిగా క్లస్టర్‌ యూనివర్సిటీ భవనాలు

జగన్నాథగట్టుపై 50.5 ఎకరాలు కేటాయింపు

రూ.139 కోట్లతో శాశ్వత భవనాలు నిర్మాణాలకు శ్రీకారం

వైసీపీ ప్రభుత్వంలో ఓ మంత్రి అండతో ఇష్టారాజ్యంగా చెల్లింపులు

రిజిసా్ట్రర్‌కు తెలియకుండానే మ్యాపింగ్‌

నిబంధనలకు విరుద్ధంగా రూ.36 కోట్లు చెల్లింపులు

క్లస్టర్‌ వర్సిటీ ప్రగతిపై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి

కర్నూలు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): దక్షిణ దేశంలో తొలి క్లస్టర్‌ విశ్వ విద్యాలయం అది. గత వైసీపీ ప్రభుత్వం అలసత్వం విద్యార్థులను శాపంగా మారింది. పాలకుల నిర్లక్ష్యం నీడలో మగ్గిపోతుంది. కష్టాల్లో మగ్గుతున్న క్లస్టర్‌ వర్సిటీని బాగు చేయండి..! అంటూ విద్యార్థులు ఏకరువు పెడుతున్నారు. కర్నూలు నగర శివారులో జగన్నాథగట్టుపై 50.5 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత భవనాలు నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిధులు ఇవ్వకపోవడంతో పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. అంతేకాదు అప్పటి ప్రభుత్వంలో నంబర్‌-2గా చెప్పుకునే ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఓ మంత్రి అందండలతో నిబంధనలు తుంగలో తొక్కేశారు. యూనివర్సిటీ రిజిసా్ట్రర్‌కు తెలియకుండానే మ్యాపింగ్‌ చేసి అక్రమంగా బిల్లులు చెల్లింపులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఆనాటి మంత్రి పాత్ర ఉందని సమాచారం. అప్పుడే గవర్నర్‌, సీఎంవో, ఆర్థిక ప్రిన్సిపల్‌ సెక్రెటరీలకు ఫిర్యాదులు వెళ్లాయి. సీఎం చంద్రబాబు, రాష్ట్ర మానవవనరులు అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ జోక్యం చేసుకొని కర్నూలు క్లస్టర్‌ యూనివర్సిటీ కష్టాలు తీర్చాలి.. నిధులు మంజూరు చేసిన అసంపూర్తి పనులు పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.

దేశంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో రద్దీని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ‘క్లస్టర్‌ యూనివర్సిటీ’లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచఆర్‌డీ) రాషీ్ట్రయ ఉచ్చతర్‌ శిక్షా అభియాన (రూసా) పథకం కింద కర్నూలుకు క్లస్టర్‌ యూనివర్సిటీని మంజూరు చేసింది. 2015 డిసెంబరు 1న న్యూడిల్లీలో జరిగిన ‘ప్రాజెక్ట్‌ అప్రూవల్‌ బోర్డు’ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దక్షణ భారతదేశంలోనే తొలి క్లస్టర్‌ విశ్వవిద్యాలయం ఇది. కర్నూలు నగరంలోని సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కేవీఆర్‌ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మెన్స డిగ్రీ కళాశాలను ఈ క్లస్టర్‌ విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకొచ్చారు. 2016-17లో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. డిగ్రీ కళాశాలలు నిర్మాణం కోసం రూసా కింద రూ.55 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపారు. 2019లో నిధులు మంజూరయ్యాయి. అయితే ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడం.. వైసీపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ‘ఏపీ క్లస్టర్‌ యూనివర్సిటీ యాక్ట్‌-2020’ను తీసుకొచ్చారు. వర్సిటీ ఏర్పడినా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్ల సహకారం లేకపోవడం, వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు వారికే వత్తాసు పలకడంతో రెండేళ్లు అలంకార ప్రాయంగా మిగిలింది. డిగ్రీ కళాశాలలు చేపట్టిన అడ్మిషన్లలో అవకతవకలు జరగడంతో ఎట్టకేలకు మూడేళ్ల తరువాత 2023-24 విద్యా సంవత్సరం నుంచి క్లస్టర్‌ వర్సిటీ పర్యవేక్షణలో యూజీ, పీజీ అడ్మిషన్లు చేస్తున్నారు. ప్రస్తుతం మూడు డిగ్రీ కళాశాల పరిధిలో మూడేళ్లు యూజీ (డిగ్రీ)లో వివిధ కోర్సుల్లో 2,796 మంది, రెండేళ్లు పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ)లో 93 మంది విద్యార్థులు చదువుతున్నారు. బోదన, బోదనేతర సిబ్బంది 238 మంది పని చేస్తున్నారు.

అసంపూర్తిగా భవన నిర్మాణాలు

కర్నూలు నగర శివారులో జగన్నాథగట్టుపై క్లస్టర్‌ యూనివర్సిటీ కోసం 50.5 ఎకరాలు కేటాయించారు. అకడమిక్‌ అడ్మినిసే్ట్రషన బ్లాక్‌, బాలుర, బాలికల వసతి గృహాలు (హాస్టల్‌), జనరల్‌ ఫెసిలిటీస్‌ భవనం (లైబ్రరీ, ల్యాబ్‌, రీసెర్చ్‌ సెంటర్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, ఇంక్యూబేషన సెంటర్‌) నిర్మాణాల కోసం రూ.80 కోట్లు మంజూరు చేశారు. అయితే పనులు జాప్యం కావడంతో నిర్మాణ అంచనా వ్యయం రూ.139 కోట్లకు చేరింది. ఏపీఈడబ్ల్యూఐడీసీ ఇంజనీర్ల పర్యవేక్షణలో పనులు చేపట్టారు. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న సింగపూర్‌ సంస్థ ఆకార్‌ ప్లానర్‌ సంస్థ భవన నిర్మాణాల కోసం ప్లానింగ్‌ డిజైన (ఆర్కిటెక్షర్‌) ఇచ్చారు. డిజైన కోసమే రూ.65 లక్షలు ఖర్చు చేశారు. హైదరాబాద్‌కు చెందిన దక్కన కనస్ట్రక్షన నిర్మాణ సంస్థ వర్సిటీ భవన నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్ట్‌ దక్కించుకొని పనులు మొదలు పెట్టింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ దాదాపు రూ.46 కోట్లు ఖర్చు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఓటాన అకౌంట్‌ బడ్జెట్‌లో నిధులు కేటాయించినా పనులు మాత్రం మొదలు పెట్టలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో వెలుగు చూసిన అక్రమాలే ఇందుకు కారణమని తెలుస్తోది.

ఫ బిల్లుల చెల్లింపులో నిబంధనలకు తూట్లు

క్లస్టర్‌ వర్సిటీ నిర్మాణం కోసం మంజూరు చేసిన నిధులు వర్సిటీ రిజిసా్ట్రర్‌ ఖాతా (అకౌంట్‌)లో ప్రభుత్వం జమ చేస్తుంది. కాంట్రాక్టర్‌ ఒప్పందం ప్రకారం ఏ మేరకు పనులు చేశారు..? చేసిన పనులు కొలతలు.. చేసిన ఖర్చుల వివరాలతో ఏపీఈడబ్ల్యూఐడీసీ ఇంజనీర్లు నిబంధనల ప్రకారం ఎం-బుక్‌ రికార్డు చేయాలి. వర్సిటీ రిజిసా్ట్రర్‌ పరిశీలించి అప్రూవల్‌ ఇవ్వడమే కాకుండా సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టర్‌లో మ్యాపింగ్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి. ఆ తరువాతే కాంట్రాక్టర్‌ ఖాతాలకు బిల్లులు జమ అవుతాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో నంబరు-2గా చెప్పుకున్న ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి అండతో ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లింపులు చేసినట్లు సమాచారం. రిజిసా్ట్రర్‌కు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉన్నత విద్యాశాఖ కీలక అధికారుల సలహాతో ఆర్థిక శాఖ కార్యాయలంలోనే మ్యాపింగ్‌ చేసి ఏపీఈడబ్ల్యూఐడీసీ ఖాతాకు నిధులు జమ చేశారు. అక్కడి నుంచి దాదాపు రూ.36 కోట్లు కాంట్రాక్టర్‌ ఖాతాకు జమ చేసినట్లు సమాచారం. కీలకమైన యూనివర్సిటీ రిజిసా్ట్రర్‌ ఖాతాలో ఉన్న డబ్బును ఆయనకు తెలియకుండా ఆర్థిక శాఖ అధికారులు మరో ఖాతాకు మళ్లించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా నిధులు మళ్లింపుపై యూనివర్సిటీ అధికారులు ఆనాడే రాష్ట్ర గవర్నర్‌తో పాటు విద్యా శాఖ, ఆర్థిక శాఖల ప్రిన్సిపల్‌ సెక్రెటరీలు, సీఎంఓ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆనాడే పనులు ఆపేశారు. గత వైసీపీ పాలకులు చేసిన పాపాలు.. విద్యార్థులను శాపాలై వెంటాడుతున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ జోక్యం చేసుకొని వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖాతాలు మళ్లించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అసంపూర్తిగా ఆగిపోయిన పనులకు మోక్షం కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:11 AM