ప్రతి భూసమస్యకు పరిష్కారం
ABN , Publish Date - Dec 13 , 2024 | 12:38 AM
రెవెన్యూ సదస్సులో ప్రతి భూసమస్యకు పరిష్కారం చూపేందుకే అధికారులు ప్రజల వద్దకు వస్తు న్నారని ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
ఓర్వకల్లు, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సులో ప్రతి భూసమస్యకు పరిష్కారం చూపేందుకే అధికారులు ప్రజల వద్దకు వస్తు న్నారని ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. గురువారం మండలంలోని కాల్వ గ్రామంలో రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యేతోపాటు నంద్యాల టీడీపీ అధ్యక్షుడు, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ హాజరయ్యారు. అంతకుముందు ఉపాధి హామీ పథకం నిధులు రూ.15లక్షలతో నిర్మిస్తున్న సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి ఎమ్మెల్యే పనులు ప్రారంభించారు. అనంతరం రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు. రెవెన్యూ సదస్సులో భూతగాదాలు, భూఆక్రమణ తదితర వాటిపై అర్జీలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఈ సందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో గ్రామంలోని నాయకులు పేదల భూములను దౌర్జన్యం గా ఆక్రమించుకుని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన భూఆక్రమా లను వెలికితీసి ప్రజలకు న్యాయం చేస్తా మన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి త్వరగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వైసీపీ పాలనలో ఎన్నికల ముందు మండలంలో ఇష్టానుసారంగా ఇంటి పట్టాలు ఇచ్చారని, వాటన్నింటిని రద్దు చేసి అర్హులకు అందిస్తామని అన్నారు. కాల్వబుగ్గ గ్రామం లో అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మండలంలో పరిశ్రమలు రావడంతో వైసీపీ పాలనలో భూ ఆక్రమణలు విచ్చలవిడిగా కొనసాగాయని వాటిపై విచారణ చేపడుతామన్నారు. కార్యక్రమంలో డీపీవో భాస్కర్, తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీవో శ్రీనివాసులు, ఎస్‌ఐ సునీల్ కుమార్, ఎంపీటీసీ నాగిరెడ్డి, నాయకులు రజాక్‌బాషా, ఖాదర్‌బాషా, మహబూబ్ బాషా, కేవీ మధు, లక్ష్మణ్ నాయక్, మౌళీశ్వరరెడ్డి, ఆయా శాఖ అధికారులు, సచివా లయ సిబ్బంది పాల్గొన్నారు.