మంకీ ఫాక్స్‌తో అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Aug 28 , 2024 | 12:54 AM
మంకీ ఫాక్స్‌తో అప్రమత్తంగా ఉండాలని పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి.ప్రభాకర్ రెడ్డి అన్నారు.
కర్నూలు(హాస్పిటల్), ఆగస్టు 27: మంకీ ఫాక్స్‌తో అప్రమత్తంగా ఉండాలని పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి.ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం సూపరింటెండెంట్ చాంబరులో మంకి ఫాక్స్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో మంకీ పాక్స్ కేసులు పెరుగుతుండటంతో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్యఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసిందన్నారు. పెద్దాసుపత్రిలో ఆరు పడకలతో అత్యాధునిక వైద్యసేవలతో మంకి ఫాక్స్ వార్డును ఏర్పాటు చేశామన్నారు. ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యుల బృందం, నోడల్ అధికారుల ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నోడల్ అధికారులుగా మెడిసిన హెచవోడీ డాక్టర్ ఇక్బాల్ హుశేన, చర్మవ్యాధుల విభాగం హెచవోడీ డాక్టర్ పి.పద్మజ, పల్మనాలజి ప్రొఫెసర్ ఏఎస్ శ్రీకాంత, మైక్రో బయాలజి ప్రొఫెసర్ అండ్ హెచవోడీ ఏ.రేణుకాదేవి, మెడిసిన ప్రొఫెసర్ ఎం.అబ్దుల్ రహీమ్‌లను నియమించారు.