Share News

గణేశ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోండి

ABN , Publish Date - Sep 07 , 2024 | 01:26 AM

గణేశ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని హిందూ, ముస్లిం మత పెద్దలకు, గణేశ ఉత్సవ కమిటీల సభ్యులకు డోన డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు.

గణేశ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోండి
బేతంచెర్లలో మాట్లాడుతున్న డోన డీఎస్పీ శ్రీనివాసులు,

బేతంచెర్ల, సెప్టెంబరు 6: గణేశ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని హిందూ, ముస్లిం మత పెద్దలకు, గణేశ ఉత్సవ కమిటీల సభ్యులకు డోన డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. శుక్రవారం పట్టణంలోని పోలీస్‌స్టేషన ఆవరణలో సీఐ వెంకటేశ్వరరావు శాంతి కమిటీ సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల సందర్బంగా 144 సెక్షన అమలులో ఉంటుందన్నారు. సమావేశం లో తహసీల్దార్‌ ప్రకాష్‌బాబు, ఎంపీడీవో వెంకన్న, ప్రభుత్వ వైద్యాధికారిణి డా. సాగరిక, మతపెద్దలు, గణేష్‌ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలో గణేశ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని బనగానపల్లె సీఐ కృష్ణయ్య కోరారు. శుక్రవారం బనగానపల్లె పట్టణ పోలీస్‌స్టేషనలో పీస్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి . హిందూ, ముస్లిం మతపెద్దలకు ఈ సూచన చేశారు.

Updated Date - Sep 07 , 2024 | 01:26 AM