పింఛన్ల పెంపు ఘనత చంద్రబాబుదే
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:13 AM
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంచిన ఘనత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
కల్లూరు, అక్టోబరు 1: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంచిన ఘనత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మంగళవారం కల్లూరు అర్బన 34వ వార్డు నిర్మల్‌నగర్, సల్కాపురంలో చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.200 ఉన్న పింఛనను రూ.2వేలు చేసింది, గత ప్రభుత్వం రూ.3వేలు వేలు చేసిన పింఛనను ఒకేసారి రూ.4 వేలకు పెంచిన సీఎం చంద్రబాబు పేదల పక్షపాతిగా చిరకాలం నిలిచిపో తారన్నారు. కార్యక్రమంలో పెరుగు పురుషోత్తంరెడ్డి, నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ, ప్రభాకర్ యాదవ్, పియూ.మాదన్న, ఎన్వీ. రామకృష్ణ, ఎస్. ఫిరోజ్, జే.గంగాధర్‌గౌడ్, దేవేంద్రారెడ్డి, బతుకన్న, వంశిరెడ్డి, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.