అభివృద్ధే ధ్యేయంగా ముందడుగు
ABN , Publish Date - Dec 17 , 2024 | 12:46 AM
అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.
రూ.40లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభం
నాలుగు కొత్త బస్సులను ప్రార ంభించిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి
ఎమ్మిగనూరు, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని కలుగొట్ల రోడ్డు ఎంబీ చర్చి దగ్గర రూ.40లక్షలతో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే స్థానిక ఆర్టీసీ డిపోకు కొత్తగా మంజూరైన నాలుగు సెమీ లగ్జరీ బస్సులకు ప్రత్యేక పూజలు చేసి జనసేనా ఇనచార్జి రేఖాగౌడు, బీజేపీ నాయకులు నరసింహులతో కలిసి ప్రారంభించారు. అలాగే బస్సు ఎక్కి కొంతదూరం నడిపి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో రహదారులన్ని గుంతలమయంగా మారాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రహదారుల మరమ్మతులకు చర్యలు తీసుకోవడంతో పాటు కొత్తగా రూ.2కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు.. అలాగే పట్టణంలోని ప్రధాన రహదారులను సెంటర్ లైటింగ్ సిస్టమ్‌తో వెలుగులు నింపుతున్నామన్నారు. ఇక ఆర్టీసి ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను మంజూరు చేయించామన్నారు. ఇప్పటి వరకు ఎమ్మిగనూరు డిపోకు 17 కొత్త బస్సులు వచ్చాయన్నారు. ఎమ్మిగనూరు-కర్నూలుకు పల్లె వెలుగు బస్సులను కూడా మంజూరు చేయించడం జరిగిందన్నారు. మరో 16 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ అమర్‌నాథ్, టీడీపీ నాయకులు మిఠాయి నరసింహులు, ముల్లా ఖలీముల్లా, సుందర్‌రాజు, అల్తాఫ్, కొండన్నగౌడు, దేవదాసు, వాహిద్, రాళ్లదొడ్డి మురళికృష్ణారెడ్డి, రంగస్వామిగౌడు, మాచాపురం కాశింవలి, బచ్చా ల రంగన్న, గాజుల సుధాకర్, మల్లయ్య, కె.టి వెంకటేశ్వర్లు, రామకృష్ణ నాయుడు, షాలేమ్ పాల్గొన్నారు.