అభివృద్ధికి అడ్డుపడితే ఉపేక్షించం
ABN , Publish Date - Oct 10 , 2024 | 12:44 AM
కల్లూరు మండల అభివృద్ధికి అడ్డుపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత హెచ్చరించారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
కల్లూరు, అక్టోబరు 9: కల్లూరు మండల అభివృద్ధికి అడ్డుపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత హెచ్చరించారు. రాష్ట్రంలో సర్పంచులకు గౌరవం కల్పించి గ్రామ పంచాయతీలకు ప్రాణం పోసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఆమె స్పష్టం చేశారు. బుధవారం కల్లూరు మండల పరిషత కార్యాలయంలో ఎంపిడీవో జి.నాగ శేషాచలరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ బి.శారద అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే గౌరుచరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయా శాఖల మండల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సభ్యులు తెలిపిన సమ స్యలు మళ్లీ పురానవృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీల్లో నిధులు లేక సెంట్ర ల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి సర్పంచులను రోడ్లపై భిక్షాటన చేయించారని టీడీపీ కూటమి ప్రభుత్వంలో నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. గ్రామసభల్లో సర్పంచుల తీర్మాణం ఉండాలని కొంద రు సర్పంచులు సభదృష్టికి తీసుకురాగా గ్రామసభలో ప్రజల విన్నపాలు, గ్రామ సంఘాల తీర్మాణాలు కూడా పరిగణలోకి తీసుకోబడతాయని, అవి లేని పక్షంలో జిల్లా కలెక్టర్ అనుమతితో ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. అతి తక్కువ సమయంలో ప్రజలకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సభకు వివరించారు. ఎన ఆర్‌ఈజీఎస్ ఆధ్వర్యంలో రూ.4 కోట్లతో అభివృద్ది పనులు చేయనున్నామని ఈనెల 14న పల్లెపండుగ-గ్రామోత్సవంలో పనులు ప్రారంభిస్తామని గౌరుచరిత తెలి పారు. ఎంపీపీ శారద మాట్లాడుతూ కల్లూరు మండల అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం ఉంటుందన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.