వరద బాధితులను ఆదుకుంటాం: గౌరు చరిత
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:26 AM
గొల్లపూడి వరద ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
కల్లూరు, సెప్టెంబరు 11: గొల్లపూడి వరద ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గొల్లపూడి ఇనచార్జి గౌరు చరిత బుధవారం సాయిపురం కాలనీలో ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్య లను అడిగి తెలుసుకున్నారు. వరదలతో దెబ్బతిన్న పరిశ్రమల్లోని యంత్రా లను ఆమె పరిశీలించారు. వరద ఽబాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన పరిహారంపై నివేదిక రూపొందిస్తున్నామన్నారు. అర్హులైన వారందరికీ నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని పరిశ్రమల యాజ మాన్యానికి హామీ ఇచ్చారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.