Share News

తెరుచుకున్న మద్యం దుకాణాలు

ABN , Publish Date - Oct 17 , 2024 | 12:29 AM

ఎమ్మిగనూరు పట్టణంతో పాటు మండలాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు కొన్ని తెరుచుకున్నాయి.

తెరుచుకున్న మద్యం దుకాణాలు
పెద్దబావి దగ్గర ఉన్న దుకాణానికి మద్యాన్ని దించుతున్న దృశ్యం

ఎమ్మిగనూరు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు పట్టణంతో పాటు మండలాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు కొన్ని తెరుచుకున్నాయి. ఎమ్మిగనూరు ఎక్సైజ్‌ స్టేషన పరిధిలో 15 మద్యం దుకాణాలు ఉండగా వీటిని లాటరీలో కొంతమంది రాజకీయ నాయకులు, మద్యం వ్యాపారులు లాటరీలో కైవసం చేసుకున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో ఎనిమిది మద్యం దుకాణాలు ఉండగా బుధవారం రాత్రి ఒక దుకాణానికి మద్యం రావటం తో అమ్మకాలు మొదలు పెట్టారు. ఇక మిగతా దుకాణాలకు మద్యం స్టాకు రాలేదని తెలిసింది. ఇక మండల పరిధిలో మూడు దుకాణాలు ఉండగా దైవందిన్నె గ్రామంలో మద్యం దుకాణాన్ని నిర్వాహకులు ప్రారంభించారు. ఇక నందరం మండలంలో రెండు దుకాణాలు ఉండగా ఇందలో ఒక దుకాణ ం ప్రారంభమైంది. మరో దుకాణం ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే మంత్రాలయం మండలంలో రెండు దుకాణాలు నేడు ప్రారంభించనున్నట్లు తెలిసింది. గోనెగండ్ల మండలంలో మూడు మద్యం దుకాణాలు ఉండగా ఒక దుకాణం మాత్రం తెరుచుకుంది. ఎక్సైజ్‌ స్టేషనపరిధిలో ఉన్న దుకా ణాలన్ని గురువారం లేదా శుక్రవారానికి పూర్తి స్థాయిలో తెరుచుకునే అవ కాశం ఉంది. ఇదిలా ఉండగా పట్టణంలోని అన్నమయ్య సర్కిల్‌లో వెంకట సాయి ఆలయానికి ఎదురుగా రోడ్డుకు అటువైపు మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. అధికా రులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - Oct 17 , 2024 | 12:29 AM