Share News

పప్పుశనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Oct 06 , 2024 | 12:48 AM

ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందజేస్తున్న పప్పుశనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కోరారు.

పప్పుశనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి
రైతులకు పప్పుశనగ విత్తనాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత

ఓర్వకల్లు, అక్టోబరు 5: ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందజేస్తున్న పప్పుశనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కోరారు. శనివారం మండల కేంద్రమైన ఓర్వకల్లులోని పంచాయతీ కార్యాలయం ఆవరణలో వ్యవసాయాధికారి సుధాకర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చరితారెడ్డి, ఏడీఏ శాలురెడ్డి శనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి మాట్లాడుతూ మండలానికి 2,650 క్వింటాళ్ల పప్పు శనగ విత్తనాలు మంజూరయ్యాయని, రైతులకు అవసరమైతే ఇంకా మంజూరు చేస్తామని తెలిపారు. రైతులకు సాగు చేసే ప్రతి రైతుకు శనగ విత్తనాలు అందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కార్యక్ర మంలో టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మోహన రెడ్డి, వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, తహసీల్దార్‌ విద్యా సాగర్‌, ఎంపీడీవో శ్రీనివాసులు, ఈవోఆర్‌డీ సుబ్బరాయుడు, నాయకులు విశ్వేశ్వరరెడ్డి, రాంభూపాల్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి పుల్లారెడ్డి, ప్రకాశం, తిరుపాలు, రాజన్న, ఆయా గ్రామాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2024 | 12:48 AM