Share News

సూపర్‌ సిక్స్‌ పథకాలకు ప్రాధాన్యం: బీవీ

ABN , Publish Date - Nov 09 , 2024 | 01:07 AM

సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

సూపర్‌ సిక్స్‌ పథకాలకు ప్రాధాన్యం: బీవీ
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

నందవరం, నవంబరు 8(ఆంధజ్యోతి): సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవా రం మండలంలోని గురుజాల, రాయచోటి గ్రామాల్లో రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో గతు కుల రోడ్లకు పిడికేడు మట్టి వేసిన పాపాన పోలేద న్నారు. వైసీపీ విషప్రచారాలు చేస్తుందని వాటిని తిప్పికొ ట్టాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను కూటమి ప్రభుత్వం తూచ తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 262 కోట్లతో గోనెగండ్ల జీడీపీ ద్వారా అన్ని గ్రామాలకు శుద్ధజలం అందించేందుకు ప్రతిపాదనలు పంపామని వాటిని త్వరలో మంజురు చేయించి వాటర్‌గ్రిడ్‌ ద్వారా ప్రతి గ్రామానికి నీరంది స్తానన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు క్లస్టర్‌ ఇనచార్జిలు కాశీం వలి, ధర్మాపురం గోపాల్‌, పార్టీ మం డల కన్వీనర్‌ డీవీ రాముడు, చిన్న కొత్తిలి సత్యారెడ్డ్డి, సోమలగూడురు వెంకట్రామిరెడ్డి, చాకలి చంద్ర, నదికైర వాడి వీరేష్‌, అదిశేషు, వీరేష్‌, శివా రెడ్డి, రామకృష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 01:07 AM