Share News

సమస్యల పరిష్కారానికే ప్రజా వేదిక

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:50 AM

సమస్యల పరిష్కారానికే ప్రజా వేదిక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

సమస్యల పరిష్కారానికే ప్రజా వేదిక
ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే దస్తగిరి

సి.బెళగల్‌, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికే ప్రజా వేదిక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. సి.బెళగల్‌ మండల పరిషత కార్యాల యం సమావేశ భవనంలో ఎంపీపీ బొంతల మునెప్ప అధ్యక్షతన గురు వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఎమ్మెల్యే దస్తగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన రెవెన్యూ సమస్యలు, తాగునీరు, సీసీరోడ్లు, ఇళ్లు, పింఛన్లు తదితర సమస్యలపై ఎమ్మెల్యే ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కొత్తకోట హరి, అమర్‌, డాక్టర్‌ తిమ్మప్ప, మాజీ మండల కన్వీనర్‌ పాండురంగన్న గౌడు, ధనుంజయుడు, బాలజీ వెంకటేశ, పౌలు, భాస్కర్‌, ఎంపీటీసీ రవికుమార్‌, శంకర్‌, గోవిందు, డిస్‌ వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్‌, మండలస్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆ ర్వోలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:50 AM