Share News

రహదారులను సర్వనాశనం చేశారు: ఎమ్మెల్యే బీవీ

ABN , Publish Date - Nov 06 , 2024 | 12:40 AM

వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని రహదారులను సర్వనాశనం చేసిందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి విమర్శించారు.

రహదారులను సర్వనాశనం చేశారు: ఎమ్మెల్యే బీవీ
పూజ చేసి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

ఎమ్మిగనూరు, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని రహదారులను సర్వనాశనం చేసిందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని కర్నూలు రోడ్డులోని నాగిరెడ్డి పెట్రోల్‌ బంకు దగ్గర, శివసర్కిల్‌లో గుంతలు పూడ్చే పనులను మంగళవారం పూజలు చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మిగనూరు నుంచి కర్నూలుకు వెళ్లాలంటే వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడాల్సిన దుస్థితి ఏర్పడేదన్నారు. గంటలు తరబడి ప్రయాణిస్తే తప్ప ప్రయాణం సాగేది కాదన్నారు. నేను కూడా ఈ నాలుగు నెలలు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే సిగ్గుపడాల్సి వచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కూడా ఇంటికి వెళ్లాలంటే ఈ రోడ్డునుంచి వెళ్లాలని, అయినా ఐదేళ్లలో గుంతలు పూడ్చలేకపోయారన్నారు. గుంతలు పూడ్చేందుకు కూటమి ప్రభుత్వం రూ. 200కోట్లు విడుదల చేసిందన్నారు. ప్రస్తుతానికి గుంతలు పూడ్చడమే కాకుండా త్వరలో శాశ్వతంగా రోడ్డు నిర్మిస్తామన్నారు. అంతేగాక ఈ రోడ్డును నేషనల్‌ హైవైకి అనుసంధానం చేసి నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే టిడ్కో గృహాలు త్వరలో పంపి ణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జనసేన ఇనచార్జీ రేఖాగౌడ్‌, బీజేపీ నాయకులు నరసింహులు, ఆర్‌అండ్‌బీ డీఈలు నాగరాజు, రవిచంద్ర, ఏఈఈలు విజయ్‌ నరేష్‌, పెబ్బీ, ప్రభు, టీడీపీ నాయకులు కొండయ్య చౌదరి, ప్రతాప్‌ ఉరుకుందయ్య శెట్టి, రామదాసు గౌడ్‌, మహేంద్ర బాబు, వెంకటరామిరెడ్డి, ముల్లా కలీముల్లా, బడేసాబ్‌, రామకృష్ణనాయుడు, నవాజ్‌, జయన్న, నజీర్‌, దేవేంద్ర, ఆర్టీసీ అల్తాఫ్‌, పట్టానాగరాజు, మురళీ, కొండన్న గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 12:40 AM